
2024 మధ్య నాటికి నిస్సాన్ భారతదేశంలో మ్యాగ్నేట్ ఫేస్‌లిఫ్ట్‌ను ప్రారంభించనున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ ప్రస్తుత తరానికి సంబంధించి జీవితకాలం విస్తరించడానికి బాహ్య, అంతర్గత నవీకరణలను అందుకుంటుంది. 1.0 ఎల్ పెట్రోల్ ఇంజన్‌తో వచ్చే ఈ కారుపై అంచనాలు చాలా ఉన్నాయి.

2024 ప్రారంభంలో మారుతి సుజుకి కొత్త తరం స్విఫ్ట్‌ను విడుదల చేయనుంది. టోక్యోలో జరిగిన జపాన్ మొబిలిటీ షో 2023లో ఈ కారు అరంగేట్రం చేసింది. ఇది పరిణామాత్మక బాహ్య మార్పులు, కొత్త ఫీచర్లు, సాంకేతికతలతో నవీకరించిన ఇంటీరియర్‌ను పొందుతుంది. 1.2ఎల్ జెడ్-సిరీస్ మైల్డ్-హైబ్రిడ్ ఇంజన్ కూడా లైనప్‌లో చేరుతుంది.

టాటా ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విజువల్ అప్‌డేట్‌లతో 2024లో దాని మొదటి మిడ్-సైకిల్ అప్‌డేట్‌ను పొందుతుంది. ఇటీవల ఫేస్‌లిఫ్టెడ్ నెక్సాన్‌లో కనిపించే ఐదు సీటర్ల కారులా దీన్ని లాంచ్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న పెట్రోల్, డీజిల్ ఇంజన్లు వేరియంట్‌లోనే ఆల్ట్రోజ్ రేసర్ ఫేస్‌లిఫ్ట్‌తో ప్రారంభిస్తారా? లేదా? అనేది ఇంకా తెలియదు.

కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ కారు కూడా జనవరి 2024 నుంచి అందుబాటులోకి రానుంది. డీజిల్ మాన్యువల్ ట్రిమ్‌లు మినహా దాని డెలివరీలు వెంటనే ప్రారంభమవుతాయి. సవరించిన కాంపాక్ట్ ఎస్‌యూవీ కాస్మెటిక్ అప్‌డేట్‌లు, మరింత ఫీచర్-రిచ్ ఇంటీరియర్‌తో ఈ కారు ఆకర్షణీయంగా ఉంటుంది. 1.2 ఎల్ పెట్రోల్, 1.0 ఎల్ టర్బో పెట్రోల్, 1.5 ఎల్ డీజిల్ ఇంజన్లు బహుళ గేర్‌బాక్స్‌లు ఈ కారు ప్రత్యేకతలు.

టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్ 2024 ప్రారంభంలో విడుదల కానుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. రీబ్యాడ్జ్ చేసిన ఈ కారు లోపల, వెలుపల చిన్నపాటి అప్‌డేట్‌లను పొందుతుంది. 1.2 ఎల్ పెట్రోల్, 1.0 ఎల్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌లు ఎంటీ, ఏటీ ఎంపికలతో వస్తాయి.