4 / 5
ఈ పథకంలో గరిష్ట రాబడిని పొందడానికి ప్రతి నెల 5వ తేదీలోపు డిపాజిట్ చేయాలని అధికారులు పేర్కొంటున్నారు. నెల నెల 5వ తేదీ తర్వాత డిపాజిట్ చేస్తే ఆ నెల వడ్డీని కోల్పోవచ్చు. ఉదాహరణకు ఒక వ్యక్తి ఏప్రిల్ 20న పీపీఎఫ్‌లో రూ.1.5 లక్షలు డిపాజిట్ చేస్తే, ఆ ఆర్థిక సంవత్సరంలో అతనికి 11 నెలలు మాత్రమే వడ్డీ లభిస్తుంది. ఫలితంగా మీరు 2023-24 సంవత్సరానికి కొంత మాత్రమే రీఫండ్ పొందుతారు. మరోవైపు అదే మొత్తాన్ని ఏప్రిల్ 5న డిపాజిట్ చేస్తే అదే కాలానికి రూ.10,650 లాభం వస్తుంది. పీపీఎఫ్ ప్రస్తుతం 7.1 శాతం వడ్డీని అందిస్తుంది. ఈ పీపీఎఫ్‌పై ప్రభుత్వం ప్రతి సంవత్సరం వడ్డీ రేటును నిర్ణయిస్తుంది.