
ఈ పథకం అతి ముఖ్యమైన ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో వడ్డీని నెలవారీగా కాంపౌండింగ్ చేస్తారు. అంటే అసలుపై మాత్రమే కాకుండా ప్రతి నెలా జమ అయ్యే వడ్డీపై కూడా మళ్లీ వడ్డీని చెల్లించడం జరుగుతుంది. ఈ కాంపౌండింగ్ పద్ధతి ద్వారా పెట్టుబడిదారుని మొత్తం ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఈ పథకం యొక్క లాక్ ఇన్ కాలం 5 సంవత్సరాలు.

ఈ పథకంలో రాబడి ఎలా ఉంటుందంటే.. ఒక వ్యక్తి నెలకు రూ.25,000 చొప్పున 5 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడితే అతను మొత్తం రూ.15 లక్షలు డిపాజిట్ చేస్తాడు. ప్రస్తుత 6.7శాతం వడ్డీ రేటు, నెలవారీ కాంపౌండింగ్ ప్రకారం.. ఈ పెట్టుబడికి దాదాపు రూ.2,84,148 నికర వడ్డీ లభిస్తుంది. ఫలితంగా 5 ఏళ్ల మెచ్యూరిటీ సమయంలో మొత్తం రూ.17,84,148 పొందుతారు.

ఈ పథకాన్ని ప్రతి ఒక్కరూ రూ.25,000 తో ప్రారంభించాల్సిన అవసరం లేదు. తమ ఆర్థిక సామర్థ్యాన్ని బట్టి 1000తో కూడా ఈ స్కీమ్‌ను ప్రారంభించొచ్చు. ఏ భారతీయ పౌరుడైనా ఈ పథకంలో ఖాతా తెరవడానికి అర్హులే. ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ RD పథకం వార్షికంగా 6.7శాతం వడ్డీ రేటును అందిస్తోంది.

మీరు సింగిల్ లేదా జాయింట్ ఖాతాను తెరవవచ్చు. తల్లిదండ్రులు 10 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న మైనర్ పిల్లల పేరు మీద కూడా ఈ ఖాతాను ప్రారంభించవచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం చాలా సులభం. కేవలం నెలకు కనీసం రూ.100 తో దీన్ని ప్రారంభించవచ్చు. ఈ పథకంలో గరిష్ట పెట్టుబడి పరిమితి అంటూ ఏదీ లేదు.

ఇది 5 ఏళ్ల ప్రణాళిక అయినప్పటికీ అత్యవసరమైతే మూడు సంవత్సరాల తర్వాత దాన్ని మూసివేసే ఆప్షన్ ఉంది. అయితే వాయిదాలను ఆలస్యం చేస్తే ప్రతి రూ.100 కు రూ.1 చొప్పున జరిమానా వర్తిస్తుంది. దురదృష్టవశాత్తూ పెట్టుబడిదారుడు మరణించినట్లయితే, డిపాజిట్ మొత్తం, జమ అయిన వడ్డీ మొత్తం నామినీకి ట్రాన్స్‌ఫర్ అవుతుంది.