
ఇండియన్ పోస్ట్ ఆఫీస్ కొత్త నెలవారీ ఆదాయ పథకం (MIS) 2025ను ప్రవేశపెట్టింది. ఈ పథకంలో మీరు ప్రతి నెలా హామీతో కూడిన రాబడిని పొందుతారు. ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో మీరు ఒకేసారి ఒక మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. దానిపై మీకు 7.5% వడ్డీ లభిస్తుంది. దీనివల్ల మీకు ప్రతి నెలా మంచి ఆదాయం లభిస్తుంది. మీ రోజువారీ ఖర్చులు సులభంగా తీర్చుకోవచ్చు

పోస్ట్ ఆఫీస్ 2025 MIS పథకం గురించి తెలుసుకుందాం. ఈ పథకంలో డబ్బు జమ చేస్తే మీకు ప్రతి నెలా రూ.18,350 ఆదాయం వస్తుంది. మరి 2025 మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (MIS) పథకంలో ఎవరు పెట్టుబడి పెట్టవచ్చో పూర్తి వివరాలు తెలుసుకుందాం..

ఏ భారతీయ పౌరుడైనా ఈ పోస్టాఫీసు పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. కానీ అతని వయస్సు 18 సంవత్సరాలు కంటే ఎక్కువ ఉండాలి. మీరు మైనర్ పేరు మీద పెట్టుబడి పెట్టాలనుకుంటే మీరు ఉమ్మడి ఖాతాను తెరిచి పెట్టుబడి పెట్టవచ్చు. పోస్ట్ ఆఫీస్ MIS పథకంలో గరిష్టంగా 3 మంది పెద్దలు ఉమ్మడి ఖాతా తెరవడం ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు.


16,650 రూపాయలు ఎలా పొందాలి?: మీరు పోస్ట్ ఆఫీస్ MIS పథకంలో రూ. 9 లక్షలు పెట్టుబడి పెడితే, మీకు ప్రతి నెలా రూ. 5,550 లభిస్తుంది. ఇది త్రైమాసిక ప్రాతిపదికన రూ. 16,650 అవుతుంది. ఈ పథకం కాల పరిమితి 5 సంవత్సరాలుగా ఉంటుంది. మీరు జాయింట్ ఖాతా ఓపెన్ చేసి రూ. 15 లక్షలు డిపాజిట్ చేశారు అనుకుందాం. అప్పుడు నెలకి రూ. 9250 వడ్డీ మీ బ్యాంకు ఖాతాలోకి వస్తుంది.