
ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థ పోస్టాఫీస్ ఎప్పటికప్పుడు కొంగొత్త పథకాలతో వినియోగదారులను ఆకర్షిస్తోన్న విషయం తెలిసిందే. పోస్టాఫీస్‌లో పెట్టుబడి పెడితే రిస్క్ తక్కవ, పక్కా ఆదాయం ఉంటుంది. తక్కువ సమయంలో ఎక్కువ రాబడి పొందవచ్చు. ఎలాంటి రిస్క్ లేకుండా మంచి ఆదాయం పొందే వాటిలో బెస్ట్ పథకాలు అందించడంలో పోస్టాఫీస్ స్కీమ్స్ ముందు వరుసలో ఉంటాయి.

పోస్టాఫీస్ అందిస్తోన్న ఇలాంటి ఉత్తమ పథకాల్లో ఒకదాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పోస్టాఫీస్ అందిస్తోన్న పథకం పేరు పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి రాబడి పొందొచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఎలాంటి రిస్క్ లేకుండా లక్షల్లో ఆదాయం పొందొచ్చు. ఇంతకీ పోస్టాఫీస్ అందిస్తోన్న టైమ్ డిపాజిట్ పథకం ఏంటి..? దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే.

పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ పథకంలో పెట్టుబడి పెడితే 7.5 శాతం వడ్డీ రేటును పొందుతారు. ఇందులో వివిధ కాల వ్యవధుల్లో పెట్టుబడి పెట్టే అవకాశం కల్పిస్తున్నారు. పెట్టుబడిదారులు 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాల కాలవ్యవధితో డబ్బును పెట్టుబడిపెట్టొచ్చు.

ఒక ఏడాదికి పెట్టుబడి పెడితే 6.9 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. అలాగే 2 నుంచి 3 ఏళ్ల కాలవ్యవధితో పెట్టుబడి పెడితే 7 శాతం వడ్డీ లభిస్తుంది. 5 ఏళ్ల కాల వ్యవధికి పెట్టుబడి పెడితే 7.5 శాతం వడ్డీ రేటు లభిస్తుంది.

ఉదాహరణకు మీరు 5 ఏళ్ల కాలానికి టైమ్ డిపాజిట్ పథకంలో రూ. 5 లక్షల పెట్టుబడి పెట్టారు అనుకుందాం. మీకు ఈ మొత్తానికి 7.5 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ లెక్కన చూస్తే మీరు ఒకవేళ 5 ఏళ్ల కాలానికి పెట్టుబడిపెడితే.. మొత్తం రూ. 2,24,974 వడ్డీని పొందుతారు. మెచ్యూరిటీపై మీరు 5 సంవత్సరాల తర్వాత మొత్తం రూ. 7,24,974 పొందవచ్చు. ఇలా ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా తక్కువ కాలంలోనే మంచి ఆదాయం పొందొచ్చు.