కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. రైతులకు పెట్టుబడి ఖర్చులు అందించేందుకు ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకాన్ని ప్రారంభించింది. ప్రధాన మంత్రి కిసాన్ యోజన (పీఎం కిసాన్) కింద అర్హులైన రైతులకు సంవత్సరానికి మూడు సార్లు 2000 రూపాయల చొప్పున.. మూడు వాయిదాలలో అందిస్తోంది. మొత్తంగా ప్రభుత్వం ఏటా రూ.6000 లను నేరుగా అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది.
పీఎం కిసాన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు 13 వాయిదాలను ప్రభుత్వం విడుదల చేసింది. చాలా మంది రైతులు ప్రధానమంత్రి కిసాన్ యోజన 14వ విడత నగదు రూ. 2000 కోసం ఎదురు చూస్తున్నారు. అయితే, కొంతమందికి రెండు వాయిదాలు కలుపుకుని రూ. 4000 లభిస్తుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. నివేదికల ప్రకారం, 13వ విడతలో రూ.2000 అందుకోని రైతులకు 14వ విడతలో (13వ విడత కలుపుకుని) రూ.4000 వచ్చే అవకాశం ఉంది.
చాలా మంది రైతులకు 13వ విడత డబ్బులు రాకపోవడంతో వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి కాలేదు. అయినప్పటికీ, పెద్ద సంఖ్యలో రైతులు తమ ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేసారు. ఈ రైతులకు ఇప్పుడు రూ.2000 బదులు రూ.4000 అందుతుంది.
Pm Kisanప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు 13 విడతలుగా రూ.2,000 విడుదల చేసింది. ఇప్పుడు 14వ విడత డబ్బులు రావాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి 3 సార్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు డబ్బును బదిలీ చేస్తుంది.
పీఎం కిసాన్ యోజన పథకాన్ని 2019లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. కొన్ని మార్గదర్శకాలతో సాగు భూమి ఉన్న రైతు కుటుంబాలకు ఆదాయ మద్దతును అందించడం లక్ష్యంగా దీనిని అందుబాటులోకి తీసుకువచ్చారు. పథకం కింద, సంవత్సరానికి రూ. 6000 మొత్తాన్ని మూడు నెలల వాయిదాలలో..రూ. 2000 నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తారు.