Toll Charge: వాహనదారులకు బ్యాడ్‌న్యూస్.. టోల్ ఛార్జీలపై కేంద్రం షాకింగ్ డెసిషన్.. అవన్నీ బంద్

Updated on: Feb 22, 2026 | 3:52 PM

కేంద్రం షాకింగ్ డెసిషన్ తీసుకుంది. ఇక నుంచి టోల్ గేట్ల వద్ద క్యాష్ పేమెంట్స్ పూర్తిగా బంద్ చేయనుంది. మొన్నటివరకు ఫాస్టాగ్ లైన్లు ప్రత్యేకంగా ఉండగా.. నగదు రూపంలో టోల్ చెల్లించేవారికి కోసం ప్రత్యేక లైన్లు ఉండేవి. ఏప్రిల్ 1 నుంచి నూతన మార్పులు రానున్నాయి.

1 / 5
టోల్ ఛార్జీల చెల్లింపు విషయంలో కేంద్రం బిగ్ డెసిషన్ తీసుకుంది. ఇక నుంచి జాతీయ రహదారులపై టోల్ గేట్ల వద్ద నగదు చెల్లింపులు బంద్ చేసింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. ఇక నుంచి టోల్ చెల్లించాలంటే క్యాష్ తీసుకోలేరు. ఫాస్టాగ్ లేదా యూపీఐ ద్వారా టోల్ చెల్లించాల్సి ఉంటుంది. టోల్ చెల్లింపుల్లో అక్రమాలను అరికట్టేందుకు, పారదర్శకత తెచ్చేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

2 / 5
ఇక డిజిటల్ ఇండియాలో భాగంగా నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుది. ఇప్పటివరకు నగదు రూపంలో టోల్ ఛార్జీ చెల్లిస్తే రెట్టింపు వసూలు చేస్తున్నారు. ఇక ఫాస్టాగ్‌లో సరైన బ్యాలెన్స్ లేని సమయంలో లేదా ఫాస్టాగ్ చెల్లనప్పుడు వాహనదారులు నగదు రూపంలో చెల్లిస్తున్నారు. ఇక నుంచి అలా కుదరదు.

3 / 5
టోల్ ప్లాజాలలో ఫాస్టాగ్, యూపీఐ మాత్రమే ఇక నుంచి పని చేస్తుంది. నగదు రూపంలో టోల్ ఛార్జీలు చెల్లించే విధానం పూర్తిగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి బంద్ కానుంది. ప్రస్తుతం దేశంలో ఫాస్టాగ్ వినియోగం 98 శాతం దాటింది. టోల్ గేట్ల వద్ద వాహనాల రాకపోకలు సజావుగా, కాంటాక్ట్‌లెస్‌గా తరలించడానికి ఇది సహాయపడుతుంది.

4 / 5
ఇక నుంచి టోల్ గేట్ల వద్ద రద్దీని నివారించడం,  పాదర్శకతను పెంచేందుకు ఫాస్టాగ్ విధానం ఉపయోగపడుతుంది. డిజిటల్ పేమెంట్స్ విధానం ప్రవేశపెట్టడం వల్ల మెరుగైన లైన్ మార్గం రావడంతో పాటు రద్దీ తగ్గుతుంది. టోల్ సంబంధిత లావాదేవీల్లో మెరుగైన స్థిరత్వం, పారదర్శకత ఉంటుంది.

5 / 5
2014లో పైలట్ ప్రాజెక్టుగా  ఫాస్టాగ్ విధానాన్ని తీసుకొచ్చారు. 2019 చివరి నుంచి దేశంలోని జాతీయ రహదారులపై దీనిని తప్పనిసరి చేశారు. ఆగస్టు 2025లో ఫాస్టాగ్ వార్షిక పాస్ తీసుకొచ్చారు. ఈ పాస్ ద్వారా 200 ట్రిపులకు అపరిమిత దూరం ప్రయాణం చేయవచ్చు. దీని ఫీజు రూ.3 వేలుగా ఉంటుంది.

Follow Us