
కొత్తగా బైక్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అది కూడా అధిక మైలేజీ ఇచ్చే బైక్ కావాలనుకుంటున్నారా..? అందుకు ఒక ఆప్షన్ ఉంది. బజాజ్ కంపెనీకి చెందిన బైక్ సిటీ 100 బైక్ అదిరిపోయే మైలేజీ ఇ్తుందని కంపెనీ చెబుతోంది.

అయితే బజాజ్ సీటీ 100 ధర రూ.55 వేలు వరకు ఉంది. మీరు రూ.6 వేలు డౌన్ పేమెంట్ చెల్లిస్తే.. ఇంకా రూ.49,214 కట్టాల్సి ఉంటుంది. ఈ మొత్తానికి బ్యాంక్ నుంచి లోన్ తీసుకుని చెల్లించవచ్చు. ఉదాహరణకు.. 9.7 శాతం వరకు వడ్డీ రేటుతో మీరు లోన్ తీసుకున్నారని అనుకుంటే.. ఇప్పుడు మీకు నెలకు రూ.1765 చెల్లించాలి. మీరు ఇలా 36 నెలలు కట్టాల్సి ఉటుంది. అదే మీరు ఇంకా ఈఎంఐ భారం తగ్గించుకోవాలని భావిస్తే.. అప్పుడు ఐదేళ్ల టెన్యూర్ పెట్టుకోవాలి. అప్పుడు ఈఎంఐ రూ.1218 అవుతుంది.

ఇకపోతే బజాజ్ సీటీ 100 బైక్ ఏకంగా లీటరుకు 90 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంటోంది. లోకల్‌లో ఇంత మైలేజీ రాకపోయినా.. ఇతర బైక్స్ కన్నా మెరుగైన మైలేజ్ ఇస్తుందని చెప్పుకోవచ్చు. మంచి మైలేజీ కావాలని కోరుకునేవారికి ఈ బైక్ మంచి అవకాశం.