Income Tax Rules: కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్.. ఏప్రిల్ 1 నుంచి భారీ మార్పులు.. అమల్లోకి వచ్చేవి ఇవే..

Updated on: Mar 21, 2026 | 10:26 AM

దేశ ప్రజలకు అలర్ట్. ఏప్రిల్ 1కు మరో 10 రోజులే టైమ్ ఉంది. కొత్త ఆర్ధిక సంవత్సరం రాబోతుంది. దీంతో ఆర్ధిక కార్యకలాపాల్లో అనేక మార్పులు రానున్నాయి. ఈ సారి కొత్త ఆదాయపు పన్ను చట్టం అమల్లోకి రాబోతుంది. దీంతో చాలా మార్పులు జరగనున్నాయి.

1 / 5
ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్ పూర్తిగా మారనున్నాయి. ఈ మేరకు ఆదాయపు పన్ను నిబంధనలు 2026ను కేంద్ర ప్రభుత్వం తాజాగా నోటిఫై చేసింది. కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025 అమలు చేసేందుకు కొత్త రూల్స్ తీసుకొచ్చారు. పన్ను చెల్లింపుదారులను ఈ కొత్త నియమాలు ప్రభావితం చేయనున్నాయి. మరి కొద్ది రోజుల్లో అమల్లోకి రానున్న కొత్త నిబంధనల గురించి ఇందులో చూద్దాం.

2 / 5
ఒక ఆస్తిని ఎంతకాలం పాటు కలిగి ఉండచ్చనే దానిపై హెల్డింగ్ పీరియడ్ విషయంలో స్పష్టతను కొత్త రూల్స్ ఇస్తున్నాయి. బాండ్లు, డిబెంచర్లు, డిపాజిట్ సర్టిఫికేట్లు తర్వాత షేర్లు, డిబెంచర్లుగా మార్చితే హోల్డింగ్ పీరియడ్ జరిగిన సమయం నుంచి తెక్కించరు. పెట్టుబడిదారులు అసలు పత్రాన్ని ఎంతకాలం కలిగి ఉన్నాడో ఆ వ్యవధిలో కలుపుతారు.

3 / 5
ఇక ఆదాయ ప్రకటన పథకం 2016 ప్రకారం ప్రకటించిన ఆస్తులకు ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. భూమి, ఇల్లు, స్థిరాస్తి, రిజిస్టర్ దస్తావేజు ఉన్నట్లయితే.. దానిని కలిగి ఉన్న కాలాన్ని అసలు కొనుగోలు తేదీ నుంచి లెక్కిస్తారు. ఇక ఇతర ఆస్తుల విషయానికొస్తే.. కలిగి ఉన్న కాలాన్ని 2016, జూన్ 1 నుంచి లెక్కిస్తారు.

4 / 5
ఇక విదేశీ కంపెనీ శాఖను దేశంలో అనుబంధ సంస్థగా మార్చితే.. బదిలీ చేయబడిన ఆస్తులు యాజమాన్య కాలం కూడా చేర్చుతారు. విదేశీ బ్రాంచ్ లేదా యజమాని కలిగి ఉన్న కాలం ఉంటుంది. ఇక కంపెనీల డివిడెంట్ల ప్రక్రియను మరింత కఠినతరం చేశారు. ఇక నుంచి  దేశంలోని కంపెనీలు తమ పార్టనర్ల పూర్తి రిజిస్టర్‌ను తప్పనిసరిగా నిర్వహించుకోవాలి.

5 / 5
ఇక డివిడెండ్‌ను ఆమోదించే వార్షిక సర్వసభ్య సమావేశం భారత్‌లోనే జరగాలి. ఇక డివిడెండ్ల చెల్లింపులు కూడా భారత్‌లో జరపాలి. లావాదేవీలను పారదర్శకంగా నిర్వహించేందుకు, పన్ను సమ్మతిని బలోపేతం చేడం, పన్ను ఎగవేతలను తగ్గించేందుకు ఈ కొత్త రూల్స్ ఉపయోగపడనున్నాయి. ఇక వివాదాలను కూడా తగ్గిస్తుంది.

Follow Us