
రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం రకరకాల రీఛార్జ్ ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. మీరు తక్కువ ధరలో మీ డేటా వినియోగంపై పరిమితి లేని ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే జియో నుండి ఈ ప్లాన్ అందిస్తోంది.

ఈ ప్లాన్‌కు రోజువారీ డేటా పరిమితి లేదు. అంటే మీరు ఎలాంటి అంతరాయం లేకుండా ఇంటర్నెట్‌ని ఉపయోగించవచ్చు. ఈ ప్లాన్‌లో కాలింగ్, ఎస్‌ఎంఎస్ వంటి అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ ప్లాన్ గురించి పూర్తిగా తెలుసుకుందాం.

జియో ఈ ప్లాన్ ధర 296 రూపాయలు. ఈ ప్లాన్ వాలిడిటీ 30 రోజులు. ఇందులో రోజువారీ పరిమితి ఇవ్వలేదు. ఎలాంటి అంతరాయం లేకుండా మీరు డేటాను ఉపయోగించుకోవచ్చు.

వినియోగదారులకు 30 రోజుల్లో 25 జీబీ డేటా అందిస్తుంది జియో. అలాగే ఏ నెట్‌వర్క్‌కైనా కాల్ చేయడానికి అపరిమిత కాలింగ్ సౌకర్యం అందిస్తోంది.

ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లులు అందుతాయి. దీనితో పాటు, JioTV, JioCinema, JioSecurity, JioCloudకి యాక్సెస్ కూడా అందించబడుతుంది. ఇది వినియోగదారులకు అపరిమిత 5G డేటాను అందిస్తుంది.