
ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇంటి మహాలక్ష్మి అడుగుపెట్టింది. ముకేశ్ పెద్ద కుమారుడు అకాశ్ అంబానీ , కోడలు శ్లోకా అంబానీ దంపతులు మరోసారి తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు.

శ్లోకా అంబానీ బుధవారం ఆస్పత్రిలో పండంటి ఆడబిడ్డకు జన్మినిచ్చింది. అంబానీ ఇంటికి వారసురాలు రావడడంతో ఆ ఇంట సంతోషం నెలకొంది.

కాగా ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతా వివాహం 2019లో పెళ్లిపీటలెక్కారు. 2020 డిసెంబర్‌లో లో వీరికి పృథ్వీ అనే కుమారుడు జన్మించాడు. ఇప్పుడు రెండో సంతానంగా కుమార్తె జన్మించింది.

కాగా ముంబైలో ఇటీవల నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ గ్రాండ్ లాంచింగ్ ఈవెంట్ సందర్భంలో తొలిసారిగా శ్లోకా అంబానీ బేబీ బంప్‌తో కనిపించింది. దీంతో ఆమె ప్రెగ్నెన్సీతో ఉన్నట్టుగా తెలిసింది.

కాగా శ్లోకా అంబానీకి పాప పుట్టడంతో కాష్, శ్లోకా దంపతులకు శుభాకాంక్షలు, అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. బంధువులు,మిత్రులు, వ్యాపార, సినీ, రాజకీయ ప్రముఖులు, సోషల్ మీడియా ఫాలోవర్స్ విషెస్ చెబుతున్నారు.