Most Expensive Houses: రాజభవనానికి ఏమాత్రం తీసిపోవు.. దేశంలో అత్యంత ఖరీదైన 5 ఇళ్లు.. రెండింటిలో అంబానీ కుటుంబం

Updated on: Mar 19, 2026 | 3:34 PM

Most Expensive Houses: దేశంలో అత్యత ఖరీదైన భవనాలు ఉన్నాయి. అందులో టాప్‌ 5 ఖరీదైన భవనాల గురించి తెలుసుకుందాం. అందులో మొదటి స్థానంలో ముఖేష్‌ అంబానీకి చెందిన ఆంటిలియా భవనం. ఇది ముంబైలో ఉంది. దీని విలువ ఎంత? తర్వాత స్థానాల్లో ఏయే ఖరీదైన భవనాలు ఉన్నాయో తెలుసుకుందాం..

1 / 6
 Most Expensive Houses: భారతదేశంలో బిలియనీర్ల సంఖ్య పెరుగుతోంది. వీరిలో అత్యధిక సంపన్నులు ముంబైలో నివసిస్తున్నారు. ఈ సంపన్నుల సంపద గురించి ఎంతగా చర్చ జరుగుతుందో, రాజభవనాలకు ఏమాత్రం తీసిపోని వారి విలాసవంతమైన ఇళ్లు కూడా అంతే వార్తల్లో నిలుస్తాయి. ప్రపంచంలోని ఐదు అత్యంత ఖరీదైన ఇళ్లలో రెండింటిలో అంబానీ కుటుంబం నివసిస్తోంది.

2 / 6
 మొదటిది - ఆంటిలియా: దేశంలోని అత్యంత ఖరీదైన ఇళ్ల విషయానికి వస్తే దేశంలోనే అత్యంత ధనవంతుడైన రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఇల్లు ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉంది. ముంబైలోని ఆంటిలియా విలువ సుమారు రూ.15,000 కోట్లుగా అంచనా. ఇది 27 అంతస్తుల విలాసవంతమైన భవనం. ఇక్కడ ముఖేష్ అంబానీ తన పూర్తి కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. అత్యంత విలాసవంతమైన సౌకర్యాలతో కూడిన ఆంటిలియా హౌస్‌లో, అంబానీ కుటుంబం విలాసవంతమైన వాహనాలను పార్కింగ్ చేయడానికి ప్రత్యేకంగా ఆరు అంతస్తులు కేటాయించారు. దీనిని ప్రఖ్యాత చికాగో ఆర్కిటెక్టులైన విల్, పెర్కిన్స్ రూపొందించారు. ఇందులో మూడు హెలిప్యాడ్‌లు, 80 సీట్ల సినిమా థియేటర్, ఒక జిమ్, ఇతర విలాసవంతమైన సౌకర్యాలు ఉన్నాయి.

3 / 6
 రెండవది - జేకే హౌస్: భారతదేశంలో రెండవ అత్యంత ఖరీదైన ఇల్లు జేకే హౌస్. ఇది రేమండ్ గ్రూప్ చైర్మన్ గౌతమ్ సింఘానియాకు చెందినది. నివేదికల ప్రకారం, 30 అంతస్తుల నిర్మాణంతో ఇది దేశంలోనే అత్యంత ఎత్తైన ప్రైవేట్ భవనంగా పరిగణిస్తారు. దీని అంచనా వ్యయం దాదాపు రూ.6,000 కోట్లు, ఇందులో స్విమ్మింగ్ పూల్, స్పా, హెలిప్యాడ్, జిమ్ వంటి విలాసవంతమైన సౌకర్యాలు ఉన్నాయి.

4 / 6
 మూడవది - అబోడ్: దేశంలోని అత్యంత ఖరీదైన ఇళ్ల జాబితాలో అంబానీ కుటుంబం కూడా మూడవ స్థానంలో ఉంది. ముఖేష్ అంబానీ తమ్ముడు అనిల్ అంబానీకి చెందిన 'అబోడ్' ఇల్లు 17 అంతస్తుల భవనం. ఇందులో హెలిప్యాడ్, స్పా, జిమ్ వంటి 7-స్టార్ సౌకర్యాలు ఉన్నాయి. అబోడ్ హౌస్ అంచనా విలువ సుమారు రూ.5,000 కోట్లు ఉంటుందని చెబుతున్నారు.

5 / 6
 నాలుగవది - లింకన్ హౌస్: భారతదేశంలోని అత్యంత ఖరీదైన ఇళ్లలో ఒకటి 'వ్యాక్సిన్ కింగ్'గా ప్రసిద్ధి చెందిన సైరస్ పూనావాలా ఇల్లు. ముంబైలో ఉన్న సైరస్ పూనావాలా లింకన్ హౌస్ విలువ సుమారుగా రూ.750 కోట్లు. ఈ ఆస్తి గతంలో యునైటెడ్ స్టేట్స్‌కు చెందినది. కాన్సులేట్‌గా పనిచేసింది. సైరస్ పూనావాలా దీనిని 2015లో కొనుగోలు చేశారు. లింకన్ హౌస్ 2 ఎకరాల విస్తీర్ణంలో ఉంది.

6 / 6
 ఐదవది - గులితా హౌస్: ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ తన భర్త ఆనంద్ పిరమాల్, పిల్లలతో కలిసి ముంబైలోని గులితాలో నివసిస్తున్నారు. దేశంలోని అత్యంత ఖరీదైన ఇళ్ల జాబితాలో గులితా హౌస్ కూడా చేర్చింది. ప్రముఖ పారిశ్రామికవేత్త, ముఖేష్ అంబానీ బావ అయిన ఆనంద్ పిరమాల్, అతని భార్య స్వాతి పిరమాల్ ఈ ఇంటిని ఇషా అంబానీ-ఆనంద్ పిరమాల్‌కు వివాహ కానుకగా ఇచ్చారు. ముంబైలోని వర్లీలో ఉన్న ఈ 5 అంతస్తుల ఇంటి విలువ సుమారు రూ. 450 కోట్లు. అలాగే ఈ విలాసవంతమైన ఇల్లు 5,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది.

Follow Us