
Mercedes Benz: ప్రస్తుతం కార్ల హవా కొనసాగుతోంది. కోవిడ్ సమయంలో క్షీణించిన కార్ల అమ్మకాలు.. ఇప్పుడు పుంచుకున్నాయి. కరోనా తగ్గిన తరువాత వాహనాల తయారీ కంపెనీలు ఆఫర్లను ప్రకటిస్తూ విక్రమాలను కొనసాగిస్తున్నాయి.

లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ ఇండియా మార్కెట్లో దూసుకుపోతోంది. రకరకాల కార్లను మార్కెట్లోకి విడుదల చేస్తోంది. మెర్సిడెస్ బెంజ్ మార్కెట్లోకి మేబాక్ ఎస్-క్లాస్ (Mercedes Maybach S-Class) విడుదల చేసింది. రెండు వేరియంట్లలో ఈ ఎస్-క్లాస్ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు కంపెనీ వెల్లడించింది.

విడుదల చేసిన మేబాక్ ఎస్-క్లాస్ 580 4 మాటిక్ ప్రారంభ ధర రూ.2.5 కోట్లుగా ఉండగా ఎస్-క్లాస్ 680 4 మాటిక్ ప్రారంభ ధర రూ.3.2 కోట్లు (ఎక్స్‌షోరూమ్)గా ఉన్నాయి.

భారతీయ వినియోగదారులకు లగ్జరీ విభాగంలో సరికొత్త వేరియంట్లను అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ఎస్-క్లాస్ విభాగంలో వీటిని తీసుకువచ్చినట్లు మెర్సిడెస్ బెంజ్ వెల్లడించింది.