సీజన్‌ ఏదైనా మందులో ఇదే కింగు..! బ్రిటిషోడు ప్రారంభించిన బ్రాండ్‌.. ధర కేవలం రూ.400!

Updated on: Nov 26, 2025 | 9:30 AM

మెక్‌డోవెల్ నంబర్ 1 విస్కీ ప్రపంచ మార్కెట్‌లో రికార్డు అమ్మకాలతో దూసుకుపోతోంది. 2025కు ముందే 30.1 మిలియన్ కేసులు అమ్మి, భారతీయ విస్కీ ప్రపంచ శక్తిగా మారింది. తక్కువ ధర, విలక్షణమైన స్కాచ్, భారతీయ ధాన్యాల మిశ్రమ రుచి దీని విజయానికి కీలక కారణాలు.

1 / 5
ఒకప్పుడు ప్రపంచ మార్కెట్‌ను ఏలిన విస్కీ ధర ఇప్పుడు భారీగా పడిపోయింది. విస్కీలో ఒక బ్రాండ్‌ ఉంది.. అందంటే చాలా మంది మద్యం ప్రియులకు ఆ బ్రాండ్‌ అంటే చాలా ఇష్టం. ఈ విషయాన్ని దాని అమ్మకాలను బట్టి చెప్పవచ్చు. 2025లో ఇంకా ఒక నెల మిగిలే ఉన్నా.. ఇప్పటికే 30.1 మిలియన్‌ కేసులు అమ్ముడయ్యాయి. ఇంతకీ ఆ బ్రాండ్‌ ఏంటంటే.. మెక్‌డోవెల్ నంబర్ వన్‌. ప్రపంచ వ్యాప్తంగా అమ్మకాల పరంగా రికార్డు సృష్టించింది. గ్లోబల్ డేటా సంస్థ డ్రింక్స్ ఇంటర్నేషనల్ నుండి వచ్చిన తాజా నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ఒక భారతీయ విస్కీ  ప్రపంచ శక్తిగా మారిందని, మెక్‌డోవెల్ నంబర్ 1 2025లో 30.1 మిలియన్ కేసుల రికార్డు అమ్మకాలను సాధించిందని నివేదిక పేర్కొంది.

2 / 5
కేవలం రూ.400లకే.. ఏదైనా ఉత్పత్తి విజయం వెనుక ఉన్న కీలక అంశం ధర, నాణ్యత మధ్య సరైన సమతుల్యత. మెక్‌డోవెల్స్ నంబర్ 1 చారిత్రాత్మక విజయం కచ్చితంగా ఈ సమతుల్యతలోనే ఉంది. ఢిల్లీ వంటి మహానగరంలో ఈ విస్కీ 750ml బాటిల్ కేవలం రూ.400కే లభిస్తుంది. ముంబైలో దీని ధర దాదాపు రూ.680. చాలా మందికి ఈ బ్రాండ్‌ బడ్జెట్‌ ఫ్రెండ్లీ.

3 / 5
అలాగే ఈ బ్రాండ్ సక్సెస్‌కు మరో ప్రధాన కారణం దాని ప్రత్యేక రుచి. ఈ విస్కీ దిగుమతి చేసుకున్న స్కాచ్, ఎంపిక చేసిన భారతీయ ధాన్యాలు, మాల్ట్‌ల చక్కటి మిశ్రమం. ఈ మిశ్రమం భారతీయ వినియోగదారులతో ప్రతిధ్వనించడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతోంది. దీని USP, తక్కువ ధరకు దాని ప్రీమియం అనుభూతి, దీనిని అమ్మకాలలో నంబర్ వన్‌గా నిలిపింది.

4 / 5
మెక్‌డోవెల్స్ 19వ శతాబ్దపు భారతదేశంలో మూలాలు కలిగి ఉంది. 1826లో స్కాటిష్ వ్యవస్థాపకుడు అంగస్ మెక్‌డోవెల్ మద్రాసులో (ఇప్పుడు చెన్నై) మెక్‌డోవెల్ అండ్‌ కంపెనీని స్థాపించాడు. ఆ సమయంలో ఆ కంపెనీ భారతదేశంలో నివసిస్తున్న బ్రిటిష్ సమాజం కోసం సిగార్లు, టీ, మద్యం దిగుమతి చేసుకుంది. 1951లో విట్టల్ మాల్యాకు చెందిన యునైటెడ్ బ్రూవరీస్ (UB) గ్రూప్ ఆ కంపెనీని సొంతం చేసుకుంది.

5 / 5
1959లో ఆ కంపెనీ కేరళలోని చేరతలలో తన మొదటి డిస్టిలరీని ప్రారంభించింది. క్రమంగా విదేశీ దిగుమతులపై ఆధారపడటం తగ్గింది. 1963-64లో ఆ కంపెనీ తన సొంత బ్రాండ్‌ను ప్రారంభించింది. మెక్‌డోవెల్స్ నంబర్ 1 విస్కీ ఉత్పత్తి 1968లో ప్రారంభమైంది. ఐదు దశాబ్దాలకు పైగా ఈ బ్రాండ్ మద్యం ప్రియులకు ప్రియమైన బ్రాండ్‌గా మారింది.