Maruti Suzuki: అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకీ కీలక ప్రకటన చేసింది. మళ్లీ డీజిల్ వాహనాల తయారీలోకి ప్రవేశించి ప్రసక్తేలేదని స్పష్టం చేసింది.
2023లో తదుపరి దశ కాలుష్య ప్రమాణాలకు అనుగుణంగానే చర్యలు చేపడుతున్నట్లు తెలిపింది. డీజిల్ వాహనాల అమ్మకాలు కూడా మరింత తగ్గుతాయని తెలిపింది.
ఇక నుంచి డీజిల్ కార్ల తయారీలో ప్రవేశించాలని భావించడం లేదని కంపెనీ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ సీవీరామన్ పేర్కొన్నారు. కొత్త దశ ప్రమాణాలు అమల్లోకి వచ్చినట్లయితే డీజిల్ కార్ల తయారీ వ్యయాలు మరింత పెరిగే అవకాశం ఉందని, అందుకే వాటి జోలికి పోవాలని అనుకోవడం లేదన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే కాలంలో కొత్త ఇంజన్ కార్లతో పాటు ప్రస్తుతం తయారు చేస్తున్న పెట్రోల్ ఇంజన్ కార్లనే మరింత మెరుగుపరుస్తామని ఆయన వెల్లడించారు.