1/5

Maruti Swift: ప్రసిద్ధ హ్యాచ్‌బ్యాక్ కారు మారుతి స్విఫ్ట్ కూడా ఈ కరోనా యుగంలో మంచి ప్రదర్శననిచ్చింది. ఈ కారులో కంపెనీ 1.2 లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించి తయారు చేశారు. ఈ కారు ధర రూ. 5.19 లక్షల నుంచి రూ.చ8.02 లక్షల మధ్య ఉంటుంది.
2/5

Maruti Baleno: ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు, బాలెనో అత్యధిక సేల్స్ సాధించిన కార్ల జాబితాలో మూడవ స్థానంలో నిలిచింది. కంపెనీ తన నెక్సా షోరూమ్ ద్వారా ఈ కారును విక్రయిస్తోంది. ఈ కారులో కంపెనీ 1.2 లీటర్ డ్యూయల్‌జెట్ పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించింది. ఈ కారు ధర రూ .5.63 లక్షల నుంచి రూ .8.96 లక్షల మధ్య ఉంటుంది. మార్కెట్లో మంచి సెల్లింగ్ ఉంది.
3/5

Maruti Dzire: మారుతి సబ్‌ఫోర్ మీటర్ కాంపాక్ట్ సెడాన్ దాని విభాగంలో అత్యధికంగా అమ్ముడైన కారు ఇది. గత సంవత్సరం కంపెనీ నుంచి ఎక్కువగా అమ్ముడైన ఐదోవ కారుగా నిలిచింది. ఈ వాహనం పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే మార్కెట్లో లభిస్తుంది. ఇందులో కంపెనీ 1.2 లీటర్ల సామర్థ్యం గల ఇంజిన్‌ను ఉపయోగించింది. దీని ధర రూ .5.89 లక్షల నుంచి రూ. 8.8 లక్షల మధ్య ఉంటుంది.
4/5

Maruti WagonR: మారుతి సుజుకి టాల్ బాయ్ అని పిలిచే ఈ హ్యాచ్‌బ్యాక్ కారు మారుతి వాగన్ఆర్ సంస్థలో అత్యధికంగా అమ్ముడైన రెండవ కారుగా నిలిచింది. ఈ కారు పెట్రోల్ ఇంజిన్‌తో పాటు సిఎన్‌జి ఆప్షన్‌తో కూడా మార్కెట్లో లభిస్తుంది. ఈ కారు ధర రూ .4.45 లక్షల నుంచి రూ .5.94 లక్షల మధ్య ఉంటుంది.
5/5

Maruti Alto: సంస్థలో అత్యధికంగా అమ్ముడైన కారు మాత్రం Maruti Altoనే అని చెప్పాలి. అంతేకాదు ప్రస్తుతం ఇది దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా కూడా మారింది. ఇది కంపెనీ చౌకైన కారు, దీని ధర రూ .2.94 లక్షల నుంచి రూ .4.36 లక్షల మధ్య ఉంది.