
బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. దీంతో గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న తగ్గుదలకు బ్రేక్ పడినట్లయింది. గోల్డ్ రేట్లు గత రెండు వారాలుగా భారీగా పడిపోయిన విషయం తెలిసిందే. ఆరు నెలల కనిష్ట స్థాయికి పతనమవ్వడంతో.. ధరలు మరింత తగ్గుతాయోమోనని కొనుగోదారులు ఆశించారు. అయితే వారి ఆశలు అడియాశలయ్యాయి. శుక్రవారం ఉన్నట్లుండి గోల్డ్ రేట్లు పెరిగిపోయాయి. అనంతరం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,48,580 వద్ద కొనసాగుతోండగా.. నిన్నటితో పోలిస్తే రూ.2940 మేర పెరుగుదల నమోదు చేశాయి. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,36,200 వద్ద ట్రేడవుతుండగా.. ఇవాళ రూ.2700 మేర పెరిగాయి. ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

ఇక చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,50,550 వద్ద ట్రేడవుతోండగా.. శుక్రవారం రూ.3270 పెరిగాయి. 22 క్యారెట్ల ధర రూ.1,38,000 వద్ద కొనసాగుతోండగా.. నేడు రూ.3 వేలు పెరిగాయి. అటు బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,48,580 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,36,200గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,45,820 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,36,350 వద్ద ట్రేడవుతోంది. ఇక దేశీయ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల ధర రూ.1.48 లక్షల వద్ద ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1.36 లక్షల వద్ద కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే రూ.3 వేల మేర ధరలు పెరిగాయి.

ఇక వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. దేశీయ మార్కెట్లో కేజీ వెండి ధర రూ.2.60 లక్షల వద్ద కొనసాగుతోంది. నిన్న రూ.2.50 లక్షలు పలకగా.. ఇవాళ ఒక్కరోజే రూ.10 వేలు పెరిగాయి. ఇక హైదరాబాద్ మార్కెట్లో కేజీ సిల్వర్ రేటు రూ.2.65 లక్షల వద్ద ట్రేడవుతోంది. నిన్న రూ.2.60 లక్షలుగా ఉండగా.. ఇవాళ రూ.5 వేలు తగ్గింది.