
Kia Sonet Car: ప్రముఖ కార్ల తయరీ కంపెనీ కియా మోటార్స్ తన మూడో మోడల్ కియా సొనెట్ కారు ఎస్‌యూఐవీ సెగ్మెంట్లో సంచలనం సృష్టిస్తోంది. కియా సొనెట్ టాప్ మోడల్ ఎస్‌యూవీలతో సమానంగా సేల్స్ సాధిస్తోంది. కియా సోనెట్ కారులో ఫోర్ సిలిండర్ ఇంజన్, ఫైవ్ ట్రాన్స్ మిషన్ స్పీడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

పెట్రోల్, డీజిల్‌ల రకాల్లో కలిపి 16 వేరియింట్లలో లభ్యమయ్యే ఈ కారు ఎక్స్‌షోరూం ధర రూ.6.71 లక్షల నుంచి ప్రారంభం కానుంది. 6 ఎంటీ డీజిల్ వేరియంట్ ధర రూ.8 లక్షల 5 వేల నుంచి అందుబాటులో ఉంది.

కియా సొనెట్ 6.71 లక్షలతో సొనెట్ బేస్ వేరియంట్ హెచ్‌టీఈని విడుదల చేయగా, టాప్ మోడల్ జిటిఎక్స్+ధర 11.99 లక్షలు పలుకుతోంది. రోజుకు సగటున 1000 వాహనాలు బుకింగ్‌లు వస్తున్నాయని కియా సంస్థ ఇప్పటికే వెల్లడించింది. వేరియంట్‌లను బట్టి ఈ కారు కోసం వెయిటింగ్ పిరియడ్ 4-5 వారాల నుంచి 8-9 వారాల వరకు నడుస్తుందని సొనెట్ డెలివరీ లాజిస్టిక్స్ సూచించింది.

1.2l 5MT HTE వేరియంట్ కోసం పెట్రోల్ గరిష్టంగా 8-9 వారాల పాటు వెయిట్ చేయాల్సి ఉందని కంపెనీ చెబుతోంది. పెట్రోల్ 1.2 5MT HTK, 1.0T iMT HTK Plus, 1.0T 7DCT HTK Plus, డీజిల్ 1.5 6MT HTK మరియు 1.5 6MT HTX Plus కోసం 6-7 వారాల వెయిటింగ్ పీరియడ్ ఉందని చెబుతున్నారు. ఇక మిగిలిన వేరియంట్లు ప్రస్తుతం 4-5 వారాల వెయిటింగ్ పీరియడ్‌తో అందుబాటులో ఉన్నాయి.

ఇక బేస్ వేరియంట్ Kia Sonet HTE 1.2 కొనుగోలు చేయలనుకుంటే హైదరాబాద్ లో ఆన్ రోడ్ ధర రూ. 7,86,181గా పలికే అవకాశం ఉంది. ఆ లెక్కన రూ. 1,15,000 డౌన్ పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో మంచి బైక్ కొనుగోలు చేయాలంటే లక్ష పైన పెట్టాల్సిందే.