
ప్రపంచంలో అత్యంత అధునాతన ద్విచక్ర వాహనాలను తయారు చేసే కంపెనీల్లో జపాన్‌కు చెందిన కవాసాకి ఒకటి.

ఈ దిగ్గజ కంపెనీ తాజాగా కవాసాకి నింజా జెడ్‌ఎక్స్-10ఆర్ పేరుతో కొత్త బైక్‌ను లాంచ్ చేసింది.

సరికొత్త డిజైన్, అప్‌డేట్స్‌తో తీసుకొచ్చిన ఈ సూపర్ స్పోర్ట్స్ బైక్ ధర అక్షరాల 15 లక్షల రూపాయలు కావడం విశేషం.

998 సిసి, లిక్విడ్-కూల్డ్ ఇంజీన్ ( ఇన్-లైన్ 4 మోటారు) 13,200 ఆర్‌పీఎం వద్ద గరిష్టంగా 203 పవర్‌ని ప్రొడ్యూస్ చేయడం ఈ బైక్ ప్రత్యేకత.

టిఎఫ్‌టి డిస్‌ప్లే, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, ఎలక్ట్రానిక్ క్రూయిజ్ కంట్రోల్, 3 పవర్ మోడ్స్ (ఫుల్,మీడియం, లో), మూడు రైడింగ్ మోడ్స్ (స్పోర్ట్ / రోడ్ /రైన్ /రైడర్ (మాన్యువల్) ఏబీఎస్, ఈ బైక్ అధనపు ఆకర్షణలు.