
రిలయన్స్ జియో కొత్త సంవత్సరంలో వినియోగదారుల కోసం గొప్ప జియో ఆఫర్‌ను అందించింది. అయితే ఈ జియో ఆఫర్ త్వరలో ముగియనుంది. జియో ఆఫర్ ప్రయోజనం కంపెనీ రూ. 2025 ప్లాన్‌తో అందించబడుతోంది. ఈ ఆఫర్ ఎప్పుడు ముగుస్తుంది? ఇది ముగిసేలోపు మీరు ఈ ఆఫర్‌ను ఎలా ఉపయోగించుకోవచ్చో చూద్దాం.

జియో 2025 ప్లాన్ వివరాలు: రిలయన్స్ జియో రూ.2025 ప్రీపెయిడ్ ప్లాన్‌తో కంపెనీ ప్రతిరోజూ 2.5 GB హై స్పీడ్ డేటా, లోకల్, ఎస్టీడీ నెట్‌వర్క్‌లలో అపరిమిత వాయిస్ కాలింగ్, ప్రతిరోజూ 100 SMSలను అందిస్తుంది. Reliance Jio ఈ రీఛార్జ్ ప్లాన్‌తో 200 రోజుల చెల్లుబాటును అందిస్తుంది. 2.5 GB హై స్పీడ్ డేటా ప్రకారం, ఈ ప్లాన్ మీకు మొత్తం 500 GB హై స్పీడ్ డేటా ప్రయోజనాన్ని అందిస్తుంది.

అదనపు ప్రయోజనాల గురించి మాట్లాడినట్లయితే.. ఈ రూ.2025 ప్లాన్‌తో జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌కి ఉచిత యాక్సెస్ ఉంటుంది. జియో అధికారిక సైట్ ప్రకారం.. ఈ ప్లాన్‌తో ప్రీపెయిడ్ వినియోగదారులు అపరిమిత 5G డేటా ప్రయోజనాన్ని కూడా పొందుతారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, జియో సినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్రయోజనం రూ.2025 ప్లాన్‌లో అందుబాటులో ఉండదు.


ఇది మాత్రమే కాదు, మీరు Swiggy నుండి రూ. 499 విలువైన కొనుగోళ్లపై రూ. 150 తగ్గింపును కూడా పొందుతారు. మొత్తం మీద మీరు రూ. 2025 ప్లాన్‌తో రూ. 2150 ప్రయోజనాన్ని పొందుతారు. మీరు ఈ ఆఫర్ ప్రయోజనాన్ని జనవరి 31, 2025 వరకు మాత్రమే ఉంటుంది.