
2023-24 ఆర్థిక సంవత్సరం, 2024-25 అసెస్‌మెంట్ సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడానికి గడువు సమీపిస్తోంది. మీరు జులై 31, 2024 వరకు జరిమానా లేకుండా ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు.

Income Tax

వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయంపై భారతదేశంలో పన్ను చెల్లించాల్సిన పని లేదు. ఎన్‌ఆర్‌ఐ ఖాతాపై వచ్చే వడ్డీపై పన్ను లేదు. అదే సమయంలో పన్ను చెల్లింపుదారులు గ్రాట్యుటీ మొత్తం (రూ.20 లక్షలు)పై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

పట్టణ వ్యవసాయ భూమికి బదులుగా పొందిన పరిహారం వంటి కొన్ని మూలధన లాభాలపై మీరు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. భాగస్వామ్య సంస్థ ద్వారా వచ్చే లాభాలపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.మీరు ప్రభుత్వ లేదా ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల నుండి పొందిన స్కాలర్‌షిప్‌పై ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. పీఎఫ్ మొత్తాన్ని కూడా పన్ను పరిధికి దూరంగా ఉంచారు.

లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ పాక్షికంగా పన్ను నెట్‌కు దూరంగా ఉంచారు. ప్రభుత్వ ఉద్యోగులు 10 నెలల వరకు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌పై పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందవచ్చు. కాగా ప్రైవేట్ ఉద్యోగులకు ఈ పరిమితిని రూ.25 లక్షలుగా నిర్ణయించారు.

రూ.15,000 లోపు కుటుంబ పింఛనుపైనా పన్ను చెల్లించాల్సిన పనిలేదు. స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్న రూ.5 లక్షల మొత్తానికి పన్ను లేదు. అదే సమయంలో, విదేశాల నుండి పొందిన పరిహారం, బీమా కంపెనీ నుండి పొందిన మెచ్యూరిటీ మొత్తంపై ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.