- Telugu News Photo Gallery Business photos How much does each person in the ambanis family earn what is the salary of mukesh ambani nita ambani details in telugu
Ambani Family: అంబానీ కుటుంబానికి జీతమెంతో తెలుసా? ముఖేష్ అంబానీ జీతం తెలిస్తే షాక్..!
దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలలో అంబానీ కుటుంబం ఒకటి. ఈ విశాల సామ్రాజ్యాన్ని ధీరూభాయ్ అంబానీ స్థాపించారు. ప్రస్తుతం ఇద్దరు సోదరులు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ ఆ బాధ్యతను నిర్వహిస్తున్నారు. వ్యాపారమైనా, కొడుకు పెళ్లి అయినా ముఖేష్ అంబానీ ఆయన కుటుంబం ఏడాది పొడవునా వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను ప్రపంచ శక్తి కేంద్రంగా మార్చారు. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం 66 ఏళ్ల ముఖేష్ అంబానీ 116 బిలియన్ డాలర్ల నికర విలువతో ప్రపంచంలో తొమ్మిదో ధనవంతుడిగా ఉన్నారు. ముఖేష్ అంబానీ నాయకత్వంలో కంపెనీ వార్షిక ఆదాయం100 బిలియన్ల డాలర్లకు పైగా ఉంది.
Updated on: May 01, 2025 | 3:45 PM

దేశంలో అంబానీల కుటుంబ విషయాలపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. అంబానీలు ముంబైలోని 1 బిలియన్ డాలర్ల విలువైన 27 అంతస్తుల బారి ఆంటిలియాలో నివసిస్తున్నారు. 3 హెలిప్యాడ్‌లు, 160 కార్ల గ్యారేజ్, ఒక ప్రైవేట్ సినిమా హాల్, ఒక స్విమ్మింగ్ పూల్, ఒక ఫిట్‌నెస్ సెంటర్, అనేక ఇతర సౌకర్యాలు ఉన్నాయి. కానీ ఇంత విలాసవంతమైన జీవితం గడిపే అంబానీలు ఎంత సంపాదిస్తారో తెలుసా? ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్. గత కొన్ని సంవత్సరాలుగా అతను తన పనికి ఎలాంటి జీతం తీసుకోవడం లేదు. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ఆయన స్వచ్ఛందంగా తన జీతాన్ని వదులుకున్నాడు. కాబట్టి ఆయనకు జీతం రాదు.

అంబానీ భార్య నీతా అంబానీ ఆగస్టు 2023 వరకు ఆర్ఐఎల్ బోర్డులో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆమె సిట్టింగ్ ఫీజుగా రూ.2 లక్షలుగా ఉంది. కమీషన్‌గా 97 లక్షల రూపాయాలు సంపాదించారు. అంటే ఆమె మొత్తం ఆదాయం దాదాపు 1 కోటి దాకా ఉంటుంది.

ముఖేష్ అంబానీ, నీతా అంబానీల కుమార్తె ఇషా అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. రిలయన్స్ రిటైల్, జియో, రిలయన్స్ ఫౌండేషన్‌లో ఆమె ముఖ్యమైన పాత్ర పోషించారు. ఈమె తిరా బ్యూటీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సహ వ్యవస్థాపకురాలిగా ఉంది. ఆమె వార్షిక ఆదాయం రూ.4.2 కోట్లుగా ఉంది.

ఆకాశ్ అంబానీ అంబానీల పెద్ద కుమారుడు. ఈయన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్‌గా ఉన్నారు. అలాగే రిలయన్స్ రిటైల్ వెంచర్స్ బోర్డులో కూడా పనిచేస్తున్నారు. ఆకాష్ అంబానీ మొత్తం సంపద 40.1 బిలియన్ల డాలర్లు. భారత కరెన్సీలో దాదాపు 3,32,815 కోట్ల రూపాయలుగా ఉంటాయి. అంటే వార్షిక ఆదాయం 5.6 కోట్లుగా ఉంది.

అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ఇటీవల రాధిక మర్చంట్‌ను వివాహం చేసుకున్నాడు.అనంత్ అంబానీ జంతు ప్రేమికుడిగా పేరు ఉంది. అనంత్ అంబానీ జియోలో ఇంధన, టెలికాం కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. అతను జియో ప్లాట్‌ఫామ్స్, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ బోర్డుల్లో డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు. అతని మొత్తం సంపద 40 బిలియన్ అమెరికన్ డాలర్లు లేదా రూ.3,32,482 కోట్ల దాకా ఉంది. అనంత్ అంబానీ వార్షిక ఆదాయం రూ.4.2 కోట్లుగా ఉంది.




