Credit Score: క్రెడిట్ కార్డుతో ఆ పని చేస్తే.. సిబిల్ స్కోర్ పైపైకి.. ఎలా చేయాలంటే..

|

Jul 28, 2024 | 6:22 PM

క్రెడిట్ స్కోర్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ముఖ్యంగా అత్యవసర సమయాల్లో లోన్లు కావాలంటే ఈ క్రెడిట్ స్కోరే కీలకమవుతుంది. అది ఎంత మెరుగ్గా ఉంటే మీకు రుణాలు అంత సులభంగా మంజూరు అవుతాయి. తక్కువ వడ్డీ రేట్లు, అధిక క్రెడిట్ లిమిట్స్ మీకు లభిస్తాయి. ఈ క్రెడిట్ స్కోర్ పెరగడానికి లేదా పడిపోవడానికి అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. వాటిల్లో క్రెడిట్ కార్డు ప్రధానమైనది. మనం క్రెడిట్ కార్డు వాడే విధానం సిబిల్ స్కోర్ పై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా కార్డు పేమెంట్స్. డ్యూ డేట్ మిస్ కాకుండా చెల్లింపులు చేయడం వల్ల స్కోర్ బాగా పెరుగుతుంది. అయితే చాలా మంది డ్యూ డేట్ మర్చిపోతుంటారు. అలా మర్చిపోకుండా ఏం చేయాలి? కచ్చితంగా డ్యూ డేట్ కి పేమెంట్ చేయాలంటే ఎలా? తెలియాలంటే ఇది చదవండి..

1 / 5
రిమైండర్‌లు సెట్ చేయండి.. క్రెడిట్ కార్డు డ్యూడేట్ కి ముందే చెల్లింపులు చేయడం సిబిల్ స్కోర్ పెరగడానికి దోహదం చేస్తుంది. అందుకోసం సాంకేతికను ఉపయోగించుకోవచ్చు. మీ ఫోన్‌లో లేదా ఇమెయిల్ ద్వారా రిమైండర్‌లను సెట్ చేయండి. ఇది చెల్లింపు గడువు తేదీకి ముందే మీకు తెలియజేస్తుంది. ఇది మీ బిల్లు చివరి తేదీని తెలుసుకోవడానికి మీకు సహాయం చేస్తుంది. అప్పుడు మీరు చెల్లింపు చేయడం మర్చిపోలేరు.

2 / 5
ఆటోమేటిక్ పేమెంట్.. ఇప్పుడు చాలా బ్యాంకులు ఆటోమేటిక్ చెల్లింపులను అందిస్తున్నాయి. మీరు మీ లోన్‌లు, క్రెడిట్ కార్డ్ బిల్లు వంటి మీ క్లిష్టమైన బిల్లు చెల్లింపులను ఆటోమేట్ చేస్తే, ఆలస్య చెల్లింపులు ఉండవు. అప్పుడు మీపై అదనపు ఛార్జీలు, వడ్డీ కూడా పడదు. అయితే ఆటోమేట్ చెల్లింపులు జరగాలంటే మీ కార్డుకు లింకైన అకౌంట్లో ఎప్పుడూ తగినంత బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి.

3 / 5
అధిక ఖర్చులు వద్దు.. క్రెడిట్ కార్డ్ వినియోగాన్ని తనిఖీ చేయండి. మీ బడ్జెట్‌కు మించి ఖర్చు చేయవద్దు. తరచుగా బడ్జెట్‌కు మించిన అధిక ఖర్చుల కారణంగా వాటిని తిరిగి చెల్లించే క్రమంలో ఇబ్బందులకు దారి తీస్తాయి. ఇది క్రెడిట్ స్కోర్‌పై కూడా ప్రతికూల ప్రభావాన్ని కలుగజేస్తుంది. మీ క్రెడిట్ వినియోగ రేషియో 30% వరకు మాత్రమే ఉండాలి.

4 / 5
మొత్తం చెల్లించండి.. మినిమం డ్యూ మాత్రమే చెల్లించడం వల్ల మీరు ఇబ్బందులు పడతారు. మీరు మిగిలిన బ్యాలెన్స్‌పై గణనీయమైన వడ్డీని ఆకర్షిస్తారు. వీలైనంత వరకూ మొత్తం డ్యూని సెటిల్ చేయడం అవసరం.

5 / 5
క్రెడిట్ నివేదిక.. మీ క్రెడిట్ నివేదికను క్రమం తప్పకుండా లేదా కనీసం నెలకు ఒకసారి తనిఖీ చేయడం మంచిది. మీ రిపోర్ట్‌ను యాక్సెస్ చేయడం ద్వారా, మీ స్కోర్‌ను దిగజార్చగల ఏవైనా వ్యత్యాసాలు లేదా మోసపూరిత కార్యకలాపాలు ఉంటే వాటిని మీరు గుర్తించి సరి చేయవచ్చు.