
ఎంజీ కంపెనీ నుంచి వస్తున్న రెండో ఎలక్ట్రిక్ కారు ఇది. మొదటిది జెడ్ఎస్ ఈవీ కాగా, రెండోది ఈ ఎంజీ కామెట్.

ఈ కారుకు రెండు డోర్లు మాత్రమే ఉంటాయి. నలుగురు కూర్చొనే వీలుంటుంది. దీని ఎత్తు 1.63 మీటర్లు, వెడల్పు ఒకటిన్నర మీటర్లు, పొడవు సుమారు మూడు మీటర్లు ఉంటుంది.

జెడ్ఎస్ కారుతో పోల్చుకుంటే ఈ కామెట్ ఈవీ కారు పూర్తి కాంట్రాస్ట్ లో ఉంటుంది. ముఖ్యంగా సిటీ అవసరాలకు మాత్రమే ఉద్దేశించి ఈకారును రూపొందించారు. చూడటానికి కూడా చిన్నగాక్యూట్ గా ఉంటుంది.

ఈ కామెట్ ఈవీ కారు ధరను కంపెనీ అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. కానీ కొన్ని అంచనాల ప్రకారం దీని ధర రూ. 10లక్షల నుంచి రూ. 15లక్షల వరకూ ఉంటుందని చెబుతున్నారు. ఈ నెల తర్వాత దీని ధరను కంపెనీ వెల్లడించే అవకాశం ఉంది.

1.25 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, 2 స్పోక్ స్టీరింగ్ వీల్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, హిల్ స్టార్ట్ అసిస్ట్, కీలెస్ ఎంట్రీ, వాయిస్ కమాండ్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఇప్పటికే గుజరాత్‌లోని హలోల్ ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభమైంది. టాటా మోటార్స్ `టియాగో ఈవీ`కి `కొమెట్ ఈవీ` గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. ఈ కారులోని 20 కిలోవాట్ అవర్ బ్యాటరీని ఒకసారి చార్జ్ చేస్తే 200 కిలోమీటర్లు ప్రయాణించగలుతుంది.