టాటా పంచ్..
టాటా మోటార్స్ తన మైక్రో ఎస్యూవీ, పంచ్‌ను అక్టోబర్ 2021లో ప్రవేశపెట్టింది. లాంచ్ అయిన వెంటనే ఇది భారతదేశంలో అత్యంత వేగంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటిగా మారింది. కరోనా మహమ్మారి సమయం, ఆంక్షలు, డెలివరీల విషయంలో కొన్ని ఇబ్బందులు అన్నింటినీ అధిగమించి ఇప్పటి వరకూ 1 లక్ష యూనిట్లకు పైగా పంచ్‌లను విక్రయించింది. టాటా పంచ్ అనేది ఒక మైక్రో ఎస్యూవీ, ఇది ఒక్కపెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే వస్తుంది. ఇది గ్లోబల్NCAPక్రాష్ టెస్ట్ పెద్దల విభాగంలో 16.45/17 పాయింట్లను స్కోర్ చేసి, 5 స్టార్ రేటింగ్ సాధించింది. అలాగే పిల్లల భద్రతలో 40.89/49 పాయింట్లను సాధించి 4-స్టార్ రేటింగ్ అందుకొంది. టాటా పంచ్ ధర రూ. 5.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది.