Subhash Goud |
Mar 26, 2021 | 9:34 PM
డ్రైవింగ్ లైసెన్స్, వాహనాల రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్ సర్టిఫికేట్ల గడువు తేదీను 2021, జూన్ 30వ తేదీ వరకు పొగిస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ.
గత ఏడాది ఫిబ్రవరి 1 తర్వాత గడువు ముగిసిన డ్రైవింగ్ లైసెన్స్, వాహనాల రిజిస్ట్రేషన్, ఫిట్‌నెట్ సర్టిఫికేట్ 2021 జూన్ 30వ తేదీ వరకు చెల్లుబాటు అవుతాయని తెలిపింది. వాహనదారులు అంతలోపు రెన్యువల్ చేయిస్తే చాలని తెలిపింది. రెన్యువల్ చేయించుకునేందుకు మూడు నెలల గడువు ఇచ్చింది.
అయితే గతంలో ఇచ్చిన గడువు ప్రకారం.. 2021 మార్చి 31 వరకు డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ చెల్లుబాటు అవుతాయి. మార్చి 31 సమీపిస్తుండటం, మరోవైపు కోవిడ్ విజృంభిస్తుండటం దృష్టిలో ఉంచుకుని కేంద్రం తాజాగా ఈ గడువును జూన్ 30 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు ఉత్తర్వులను జారీ చేసింది. మోటార్ వెహికిల్ యాక్ట్-1988, సెంట్రల్ మోటార్ వెహికిల్ రూల్స్ 1989 కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నింటికీ ఈ గడువు పొడిగింపు వర్తిస్తుంది.