
Gold Price: గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం బంగారం, వెండి కొనుగోలు చేయాలంటే భయపడే రోజులు వచ్చాయి. గ్రాము బంగారం కొనాలన్నా సామాన్యుడి గుండె దడేల్‌మంటుంది. తులం బంగారం ధర 2 లక్షల రూపాయలకు చేరువలో ఉండగా, వెండి 4 లక్షల రూపాయలు దాటేసింది.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం జనవరి 30న బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా రూ.8,230 తగ్గగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాములపై రూ.7,550 తగ్గింది. ఇక తగ్గింపు తర్వాత 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,70,620 వద్ద ట్రేడవుతుండగా, 22 క్యారెట్ల ధర రూ.1,56,400 వద్ద ట్రేడవుతోంది.

ఇక వెండి విషయానికొస్తే కిలో గ్రాముపై ఏకంగా రూ.15,000 వరకు తగ్గింది. తగ్గిన తర్వాత ప్రస్తుతం కిలో వెండి ధర రూ.4,25,100 వద్ద ట్రేడవుతోంది. ఇది హైదరాబాద్‌లోని ధర. ఇక ఇతర ప్రాంతాల్లో రూ.3,95,000 వద్ద కొనసాగుతోంది.

ఇక బంగారం తగ్గిన తర్వాత ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,70,770 వద్ద కొనసాగుతుండగా, 22 క్యారెట్ల ధర రూ.1,56,550 వద్ద ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల ధర రూ.1,70,620 వద్ద ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,56,400 వద్ద కొనసాగుతోంది.