
బంగారం కొనుగోలు చేసేవారికి గుడ్ న్యూస్.. బంగారం ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ మూడేళ్ల తర్వాత తొలిసారి వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. బుధవారం అర్థరాత్రి ఈ ప్రకటన చేసిన క్రమంలో బంగారం ధరలు కుప్పకూలుతున్నాయి. వడ్డీ రేట్లు పెరగడంతో ప్రభుత్వ బాండ్లలో అధిక వడ్డీ లభించే అవకాశముంది. దీంతో చాలామంది వాటిల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపడంతో పసిడికి డిమాండ్ తగ్గింది. ఈ కారణంతో గోల్డ్ రేట్లు డౌన్ అవుతున్నాయి. ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే..

హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,52,840 వద్ద కొనసాగుతుండగా.. గురువారం ఒక్కరోజే రూ.600 డౌన్ అయింది. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,40,100 వద్ద ట్రేడవుతోండగా.. నేడు రూ.550 తగ్గుముఖం పట్టింది. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరల వద్ద కొనసాగుతున్నాయి.

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,840 పలుకుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,40,100కు లభిస్తున్నాయి. బెంగళూరులో 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,52,840గా కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,40,100 వద్ద ట్రేడవుతున్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,990 పలుకుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,40,250కు లభిస్తున్నాయి. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,840 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,40,100 వద్ద ట్రేడవుతోంది.

వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2.45 లక్షల వద్ద కొనసాగుతోంది. ఇక హైదరాబాద్‌లో రూ.2.50 లక్షలుగా ఉంది. బెంగళూరులో రూ.2.45 లక్షలు, చెన్నైలో రూ.2.50 లక్షల వద్ద కొనసాగుతోంది.