
బంగారం కొనుగోలు చేసేవారికి గుడ్ న్యూ్స్. ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం ధరలు భారీగా పెరగ్గా.. శనివారం ఒక్కసారిగా పడిపోయాయి. అంతర్జాతీయ పరిణామాలే దీనికి కారణంగా తెలుస్తోంది. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం త్వరలో ఖారారు అవుతుందని ఇటీవల ట్రంప్ ప్రకటన చేశారు. అప్పటినుంచి గోల్డ్ రేట్లలో ఒడిదొడుకులు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో ధరలను చూస్తే..

హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,57,040 వద్ద కొనసాగుతోండగా.. ఇవాళ ఒక్కరోజే రూ.600 మేర తగ్గింది. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,43,950 వద్ద ఉండగా.. ఒక్కరోజే రూ.550 పడిపోయింది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,59,600 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,46,300గా ఉంది. అలాగే బెంగళూరులో 24 క్యారెట్ల రేటు రూ.1,57,040 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,43,950 వద్ద కొనసాగుతోంది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,57,190గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,44,100 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరల విషయానికొస్తే.. ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.2.80 లక్షలుగా ఉంది. హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ రేటు రూ.2.90 లక్షలుగా ఉండగా.. చెన్నైలో కూడా ఇదే రేటు పలుకుతోంది. ఇక బెంగళూరులో కేజీ సిల్వర్ ధర రూ.2.80 లక్షల వద్ద కొనసాగుతోంది.

ద్రవ్యోల్బణం పెరుగుతుండటం, ఫెడ్ నుంచి సంకేతాలతో ధరలు దిగొస్తున్నాయి. ఇక అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం తాత్కాలికంగా కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. 60 రోజుల పాటు కాల్పుల విరమణ పాటించడంతో పాటు హార్ముజ్ జలసంధిని తెరిచేలా డీల్ కుదిరినట్లు సమాచారం. దీనిపై ట్రంప్ సంతకం చేయాల్సి ఉంది.