
Gold Price Update: మళ్లీ బంగారం ధరలకు రెక్కలొస్తున్నాయి. ధరలు తగ్గినట్లే తగ్గి దూసుకుపోతోంది. శుక్రవారం ఉదయం 10 గంటల సమయానికి అప్‌డేట్ అయిన ధరల ప్రకారం.. తులం బంగారంపై ఏకంగా 710 రూపాయలు పెరిగింది. అదే వెండి ధరపై 3 వేల రూపాయల వరకు పెరిగింది. వెండి ధర నిన్నటి నుంచి కిలోపై ఏకంగా 7 వేల రూపాయల వరకు ఎగబాకింది. నిన్న ఒక్క రోజు రూ.4000 పెరుగగా, ఇప్పుడు రూ.3000 పెరిగింది. ఇప్పుడు కిలో వెండి ధర రూ.1,83,000 వద్ద కొనసాగుతోంది.

ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,460 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,17,750 వద్ద ఉంది. ఇలా బంగారం ధరలు తగ్గినట్లే తగ్గి ఒక్కసారిగా పెరిగింది.

Gold Loan Market India

అదనంగా డాలర్-రూపాయి మారకం రేటు, దిగుమతి సుంకాలు, GST, ఆభరణాల వ్యాపారుల తయారీ ఖర్చులు, స్థానిక డిమాండ్, సరఫరా కూడా ధరలను ప్రభావితం చేస్తాయి.

రూపాయి బలహీనపడటం వల్ల బంగారం దిగుమతులు మరింత ఖరీదైనవి అవుతాయి. దీంతో దేశీయ ధరలు పెరుగుతాయి. వివాహాలు, పండుగ సీజన్లలో డిమాండ్ పెరగడం కూడా ధరల పెరుగుదలకు దోహదం చేస్తుంది.