
Today Gold Price: గణతంత్ర దినోత్స వేడుకల రోజులు బంగారం, వెండి ధరలు భారీ షాకిచ్చాయి. బంగారం, వెండి ధరలు అంటేనే గుండె గుబేల్‌మనేలా ఉంటున్నాయి. అయితే ప్రతి రోజు ఉదయం బంగారం, వెండి ధరలు అప్‌డేట్ అవుతుంటాయి. ఉదయం10 నుంచి 11 గంటల మధ్య ఓసారి అప్‌డేట్ అవుతుంటాయి. ఈ నేపథ్యంలో తాజాగా బంగారం ధర భారీగా పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగ ఆరూ.2,450, అదే 22 క్యారెట్ల 10 గ్రాములపై 2250 మేర పెరిగింది. ఇక వెండి విషయానికొస్త కిలో గ్రాముపై ఏకంగా రూ.5000 వరకు ఎగబాకింది.

ఉదయం 6 గంటల సమాయానికి బంగారం ధరల్లో కేవలం 10 రూపాయలు మాత్రమే స్వల్పంగా తగ్గుముఖం ఉండగా, ఇప్పుడు వేలల్లో పెరిగడం ఆందోళన కలిగిస్తోంది.

ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,710 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,49,150 వద్ద ట్రేడవుతోంది. ఇక కిలో వెండి ధర రూ.3,75,000 వద్ద ట్రేడవుతోంది. మరికొన్ని రోజుల్లో 4 లక్షల రూపాయలకు చేరుకునే అవకాశం ఉంది.

ప్రస్తుతం హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,62,710 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,149,150 ఉంది. అలాగే 18 క్యారెట్ల ధర రూ.1,22,030 వద్ద ట్రేడవుతున్నాయి.

ప్రపంచంలో రాజకీయ గందరగోళం పెరిగిన వేళ, బంగారం ధరలు సరికొత్త రికార్డును సృష్టిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా గందరగోళ పరిస్థితులు పెరగడంతో బంగారం ధర 5,000 డాలర్ల స్థాయిని దాటింది. గత రెండు సంవత్సరాల్లో బంగారం ధర రెండింతలకుపైగా పెరగడం మార్కెట్లలో భయాన్ని కొలిచే సాధనంగా బులియన్‌కు ఉన్న చారిత్రక పాత్రను మరోసారి గుర్తు చేసింది. బులియన్ ధర సుమారు 5,040 డాలర్లకు చేరింది.