Gold Prices: బంగారం ధరల్లో బిగ్ క్రాష్.. ఒక్కరోజులోనే భారీగా పతనం.. ఏపీ, తెలంగాణలో తులం ఎంతంటే..?

Updated on: May 28, 2026 | 11:38 AM

బంగారం ధరలు భారీగా క్రాష్ అయ్యాయి. ఒక్క రోజులోనే రూ.2 వేలపైనే తగ్గి ఊరటనిచ్చాయి. దీంతో గోల్డ్ కొనాలనుకునేవారికి ఇది పెద్ద ఊరటగా చెప్పవచ్చు. బంగారం కొనాలంటే ఇదే సరైన సమయంగా చెప్పవచ్చు. ట్రంప్ ప్రకటన తర్వాత ధరలు దిగొస్తున్నాయి. ప్రస్తుతం తులం ఎంతంటే..?

1 / 5
బంగారం కొనుగోలు చేసేవారికి భారీ గుడ్ న్యూస్. గత కొంతకాలంగా పెరుగుతున్న ధరల నుంచి భారీ ఊరట లభించింది. గురువారం ధరలు భారీగా కుప్పకూలాయి. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం త్వరలో జరగనుందని ట్రంప్ ప్రకటన చేసిన క్రమంలో ధరలు పడిపోతూ వస్తోన్నాయి. దీంతో ఈ పతనం మరింత కొనసాగవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ తగ్గింపు తర్వాత ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

2 / 5
హైదరాబాద్‌లో 10 గ్రామలు 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,56,060 వద్ద కొనసాగుతోండగా.. గురువారం ఒక్కరోజే రూ.2230 తగ్గింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,43,050 వద్ద ట్రేడవుతోండగా.. నేడు రూ.2050 పతనమైంది. ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

3 / 5
చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,58,180గా ఉండగా.. నిన్నటితో పోలిస్తే రూ.1640 పతనమయ్యాయి. అటు 22 క్యారెట్ల ధర రూ.1,45,000గా ఉండగా.. ఇవాళ రూ.1500 మేర క్రాష్ అయ్యాయని చెప్పవచ్చు. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,56,060 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,43,050గా ఉంది.

4 / 5
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,56,060గా ఉండగా... నిన్నటితో పోలిస్తే రూ.2380 తగ్గింది. అటు 22 క్యారెట్ల ధర రూ.1,43,050గా ఉండగా.. ఇవాళ ఒక్కరోజే రూ.2200 మేర తగ్గుముఖం పట్టింది. అటు వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి.

5 / 5
ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ. 2.75 లక్షలుగా ఉంది. నిన్న రూ.2.85 లక్షల వద్ద స్ధిరపడగా.. ఇవాళ ఒక్కరోజే రూ.10 వేలు తగ్గాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.2.85 లక్షల వద్ద ఉండగా.. నిన్న రూ.2.90 లక్షల వద్ద ఉంది. నిన్నటితో చూస్తే నేడు రూ.5 వేలు తగ్గింది. చెన్నైలో కేజీ వెండి ధర రూ.2.85 లక్షల వద్ద కొనసాగుతోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us