
బంగారం కొనుగోలు చేసేవారికి బ్యాడ్ న్యూస్. ధరలు ఒక్కసారిగా పెరిగాయి. గంటల వ్యవధిలోనే ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. ఉదయం ధరలు ఒకలా ఉండగా.. మార్కెట్లు ప్రారంభం కాగానే ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. దీంతో గోల్డ్ కొనాలనుకునేవారికి ఇది పెద్ద నిరాశను మిగిల్చింది. ఈ పెంపు తర్వాత బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం.

ప్రస్తుతం హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,58,350గా ఉండగా.. మంగళవారం రూ.1,57,040 వద్ద స్థిరపడింది. నిన్నటితో పోలిస్తే బుధవారం ఒక్కసారిగా రూ.1310 పెరిగింది. ఇక 22 క్యారెట్ల రేటు నిన్న రూ.1,43,950 వద్ద ఉండగా.. ఇవాళ రూ.1,45,150 వద్ద కొనసాగుతోంది. ఇవాళ ఒక్కరోజే రూ.1200 పెరిగింది.

ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా పై ధరలే కొనసాగుతున్నాయి. చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,60,910 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,47,500 వద్ద కొనసాగుతోంది. ఇక ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,58,500 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,45,300 వద్ద ఉంది.

అటు బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం ధర రూ. 1,58,350 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,45,150 వద్ద ఉంది. ఇక ముంబైలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. నిన్నటితో పోలిస్తే ముంబైలో రూ.వెయ్యికిపైగా గోల్డ్ రేటు పెరిగింది.

అటు సిల్వర్ ధరలు మాత్రం తగ్గాయి. హైదరాబాద్‌లో బుధవారం కేజీ వెండి ధర రూ.2.85 లక్షలుగా కొనసాగుతోంది. నిన్న ఇది రూ.3 లక్షలుగా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.15 వేలు పెరిగింది. ఇక చెన్నైలో కూడా రూ.2.85 లక్షలుగా ఉంది. ఇక ఢిల్లీలో కిలో వెండి రూ.2.80 లక్షలుగా ఉంది. నిన్న రూ.2.85 లక్షల వద్ద స్ధిరపడింది.