

అయితే ఇలాంటి సమస్యలు పరిష్కరించడానికి గ్యాస్ కంపెనీలు కసరత్తు చేస్తున్నాయి. అంటే గ్యాస్ వినియోగదారులు కేవలం వారి ఏజెన్సీ నుంచి మాత్రమే కాకుండా ఇతర ఏజెన్సీ నుంచి కూడా సిలిండర్ పొందే అవకాశం త్వరలో అందుబాటులో రానుంది.

ఒక వేళ మీరు ఇండేన్ గ్యాస్ వాడుతూంటే భారత్ సిలిండర్ కూడా తీసుకోవచ్చు. ఒక వేళ మీరు హెచ్‌పీ గ్యాస్ సిలిండర్ వాడుతుంటే భారత్ గ్యాస్ సిలిండర్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి సదుపాయం త్వరలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
