
ఉద్యో గులకు ఉద్యోగ భవిష్యనిధి అయిన ఈపీఎఫ్‌ఓ ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. నెలనెల ఈపీఎఫ్‌లో చేరే ఉద్యోగుల సంఖ్య పెరిగిపోతోంది. ఈపీఎఫ్‌లో పీఎఫ్ సభ్యుల వివరాలు ఎప్పటికప్పుడు వెల్లడిస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా డిసెంబర్ నెలలో కొత్త సభ్యులు భారీగానే వచ్చి చేరారు.

చెల్లింపుల కోసం: ప్రజలు తమ హౌస్ లోన్ EMIలను చెల్లించడానికి వారి పూర్తి ఉద్యోగి, యజమాని విరాళాలను వడ్డీతో సహా లేదా 36 నెలల వారి ప్రాథమిక జీతంతో పాటు డియర్‌నెస్ అలవెన్స్‌ను ఉపసంహరించుకోవచ్చు. అయినప్పటికీ, కనీసం 10 సంవత్సరాల పాటు EPF ఖాతా విరాళాలు చేసిన తర్వాత మాత్రమే ఈ ఎంపిక అందుబాటులో ఉంటుంది.

మహారాష్ట్ర రాష్ట్రంలో చాలా మందికి ఆ నెలలో ఈపీఎఫ్‌వోలు వచ్చాయి. మహారాష్ట్ర తర్వాత తమిళనాడు , గుజరాత్ , కర్ణాటక, హర్యానా ఉన్నాయి. డిసెంబర్‌లో 14.93 లక్షల మంది ఈపీఎఫ్‌వో ఖాతా తెరిచారు. 60.08 శాతం మంది ఈ ఐదు రాష్ట్రాలకు చెందిన వారు. ఒక్క మహారాష్ట్రలో 24.82 శాతం ఉండగా, కర్ణాటక 4వ స్థానంలో ఉంది. ఇక కొత్తగా చేరిన 8 లక్షల మందిలో 2.39 లక్షల మంది 18 నుంచి 21 ఏళ్ల మధ్య వయసు వారు ఉన్నారు. 22 నుంచి 25 ఏళ్లలోపు వారు 2.08 లక్షల మంది ఉన్నారు.

డిసెంబర్‌లో ప్రారంభమైన 14.93 పీఎఫ్ ఖాతాల్లో 10.74 లక్షల మంది సభ్యులు అకౌంట్‌ను విడిచిపెట్టి కొత్త ఖాతాను పొందారు. అంటే ఉద్యోగం మారినప్పుడు పాత పీఎఫ్ ఖాతా మూసివేయబడం జరిగింది. అలాగే కొత్త ఖాతా ప్రారంభించడం జరిగింది. 3.84 లక్షల మంది పీఎఫ్ ఖాతాలు మూసివేశారు. దీనికి కారణం వారు పదవీ విరమణ చేసి ఉండవచ్చు లేదా ఉద్యోగం కోల్పోయి ఉండవచ్చు. దీనిపై పూర్తి క్లారిటీ లేదు.

కొత్తగా నమోదు చేసుకున్న గరిష్ట సంఖ్యలో 2.39 లక్షల మంది సభ్యులు 18 నుండి 21 సంవత్సరాల వయస్సు గలవారు ఉండగా, 22 నుంచి 25 ఏళ్లలోపు 2.08 లక్షల మంది కొత్త సభ్యులు నమోదు చేసుకున్నారని ఈపీఎఫ్‌వో తెలిపింది.మొత్తం కొత్త సభ్యులలో 55.64 శాతం మంది 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉన్నారు. ఈపీఎఫ్‌ఓలో కొత్త సభ్యులను నిరంతరం చేర్చుకోవడం దేశంలోని సంఘటిత రంగంలో ఉపాధి కల్పనను పెంచడానికి సంకేతమని కొందరు నిపుణులు విశ్లేషిస్తున్నారు.