EPFO: ఉద్యోగులు ఎగిరిగంతేసే వార్త.. ఇక జనవరి నుంచి ఏటీఎంలలో పీఎఫ్ సొమ్ము.?

Updated on: Sep 27, 2025 | 7:28 PM

ఈపీఎఫ్ఓ తమ ఖాతాదారులకు అవసరమయ్యే సౌకర్యాలను అందిస్తూ.. పీఎఫ్ సొమ్మును ఈజీగా విత్ డ్రా చేసుకునే ప్రక్రియను తీర్చిదిద్దుతోంది. ఈ క్రమంలోనే త్వరలోనే ఓ కొత్త సర్వీసును అందుబాటులోకి తీసుకురానుంది. అదేంటో ఇప్పుడు ఈ వార్తలో చూసేద్దాం మరి. ఓ సారి లుక్కేయండి.

1 / 5
ఉద్యోగులు ఎగిరిగంతేసే వార్త.. ఈపీఎఫ్ఓ త్వరలోనే మరో సౌలభ్యాన్ని ఖాతాదారులకు అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటివరకు పీఎఫ్ సొమ్మును విత్ డ్రా చేసుకోవాలంటేనే తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఆ ప్రక్రియను పూర్తి చేయడం కష్టతరంగా మారింది.

2 / 5
అయితే ఇకపై ఆ ఇబ్బందులు లేకుండా.. త్వరతగిన పీఎఫ్ సొమ్మును విత్ డ్రా చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. పీఎఫ్ సొమ్మును ఏటీఎంల ద్వారా విత్ డ్రా చేసుకునే వెసులుబాటును 2026 జనవరి నుంచి ఈపీఎఫ్ఓ కల్పించనున్నట్టు తెలుస్తోంది.

3 / 5
ఇది ఖాతాదారులకు పెద్ద ఊరటను ఇచ్చే అంశం మాత్రమే కాదు.. వారికి అత్యవసరం అయ్యే సమయాల్లోనూ డబ్బు ఈజీగా అందనుంది. ముందుగా ఏటీఎం కార్డుల మాదిరి కార్డులను జారీ చేస్తుంది.

4 / 5
నగదు ఎంత విత్ డ్రా చేసుకోవచ్చనే అంశాన్ని అక్టోబర్‌లో జరిగే సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో నిర్ణయించనున్నారు. జూన్‌లోనే ఈ సదుపాయం అందుబాటులోకి రావాల్సి ఉన్నా.. పలు కారణాలతో వాయిదా పడింది.

5 / 5
ఈ నిర్ణయాన్ని కార్యరూపం దాల్చడానికి అవసరమైన సాంకేతికతను ఈపీఎఫ్ఓ ఇప్పటికే సిద్దం చేసింది. అది జనవరి 2026 నాటికి అందుబాటులోకి రానుంది. కాగా,  దేశంలో ఈపీఎఫ్ఓకు 7.8 కోట్ల మంది ఖాతాదారులున్న సంగతి తెలిసిందే.