EPFO: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్రం బిగ్ అప్డేట్.. ఉమాంగ్ యాప్‌లో కొత్త ఆప్షన్.. సెకన్లలోనే అన్నీ..

Updated on: Jul 21, 2026 | 1:20 PM

ఈపీఎఫ్ఓ పెద్ద మార్పులు ఒకటి తీసుకొచ్చింది. ఇప్పటినుంచి యూఏఎన్ యాక్టివేట్ చేసుకోవాలంటే ఈపీఎఫ్ఓ పోర్టల్‌లో చేయలేరు. ఈ మేరకు సర్వీసులను ఈపీఎఫ్ఓ తొలగించింది. ఇక నుంచి ఉమాంగ్ యాప్‌లో మాత్రమే చేసుకునే సౌలభ్యం ఉంటుంది. ఉమాంగ్ యాప్ నుంచి ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం.

1 / 5
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్. కోట్లాది మంది కస్టమర్లకు ఉపయోగపడేలా పీఎఫ్ సంస్థ ఓ పెద్ద మార్పును తీసుకొచ్చింది. ఇక నుంచి యూఏఎన్ యాక్టివేషన్ చేసుకోవాలంటే.. ఈపీఎఫ్ఓ వెబ్ సైట్లో చేసుకోలేరు. ఇక కొత్త యూఏఎన్ జనరేట్ చేసుకోవాలన్నా కుదరదు. ఈ మేరకు ఈపీఎఫ్ఓ పోర్టల్ నుంచి ఈ రెండు సేవలను నిలిపివేశారు. ఇక నుంచి యూఏఎన్ యాక్టివేట్ ఎలా చేసుకోవాలనేది చూద్దాం.

2 / 5
ఇక నుంచి యూఏఎన్ యాక్టివేట్ చేసుకోవాలన్నా లేదా కొత్తది జనరేట్ చేసుకోవాలన్నా 'ఉమాంగ్' యాప్‌లోని సాధ్యమవుతుంది. ఈ మేరకు ఈ రెండు సేవలను ఉమాంగ్ యాప్‌కు మాత్రమే పరిమితం చేసింది. అలాగే యూఏఎన్‌కు భద్రత కల్పించేందుకు ఆధార్ ఆధారిత ముఖ ధృవీకరణను కూడా తప్పనిసరి చేశారు. ఇటీవల పీఎఫ్ సంస్థ డేటాబేస్ ఏకీకరణ, సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్‌ల అనంతరం ఆన్‌లైన్ సేవలను మరింత వేగవంతంగా, సురక్షితంగా చేయడానికి ఈ మార్పులు తీసుకొచ్చింది.

3 / 5
మీ UAN యాక్టివేట్ చేశారో.. లేదో స్టేటస్ చెక్ చేసుకునేందుకు.. ఉమాంగ్ యాప్‌లోని 'UAN సర్వీసెస్ త్రూ ఫేస్ ఆథ్' కింద ఉన్న 'UAN కేటాయింపు, యాక్టివేషన్' ఎంపికకు వెళ్లండి. మీ UAN, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్‌ను నమోదు చేసి సమ్మతి బాక్స్‌ను టిక్ చేసి చేయండి. అనంతరం 'OTP పంపండి'పై క్లిక్ చేయండి. ఈ ప్రక్రియ విజయవంతమైతే.. 'నమోదు చేసిన UAN ఇప్పటికే యాక్టివేట్ చేయబడింది' అనే సందేశం స్క్రీన్‌పై కనిపిస్తుంది.

4 / 5
గత ఆర్ధిక సంవత్సరం 2025-26కు ఈపీఎఫ్ వడ్డీ రేటును 8.25 శాతంగా ఫిక్స్ చేశారు. ఇదే రేటును ఫిక్స్ చేయడం వరుసగా ఇది మూడోసారి. అటు పీఎఫ్ విత్ డ్రాలకు సంబంధించి కీలక నిబంధనలు తీసుకొచ్చారు. ఖాతాదారులు తమ EPF అకౌంట్లో ఎల్లప్పుడూ కనీసం 25 శాతం నిల్వను ఉంచాల్సి ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నప్పుడు పాక్షికంగా డబ్బులు విత్ డ్రా చేసుకోవాలంటే.. మీ మొత్తం నిధులలో గరిష్టంగా 75 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు.

5 / 5
ఉద్యోగం విడిచిపెట్టిన తర్వాత అకౌంట్లోని బ్యాలెన్స్ మొత్తాన్ని ఒకేసారి విత్ డ్రా చచేసుకోవచ్చు.
ఉదాహరణకు ఒక చందాదారుని ఖాతాలో మొత్తం రూ.2 లక్షలు ఉంటే.. గరిష్టంగా రూ.1,50,000 తీసుకోవచ్చు. కనీసం రూ.50,000 నిల్వ మిగిలి ఉంటుంది.

ఉద్యోగం విడిచిపెట్టిన తర్వాత అకౌంట్లోని బ్యాలెన్స్ మొత్తాన్ని ఒకేసారి విత్ డ్రా చచేసుకోవచ్చు. ఉదాహరణకు ఒక చందాదారుని ఖాతాలో మొత్తం రూ.2 లక్షలు ఉంటే.. గరిష్టంగా రూ.1,50,000 తీసుకోవచ్చు. కనీసం రూ.50,000 నిల్వ మిగిలి ఉంటుంది.

Follow Us