
గుజరాత్‌కు చెందిన రమేష్ రూపరేలియా అనే వ్యక్తికి సొంత భూమి కూడా లేదు. అతను గొండాల్‌లోని జైన కుటుంబం నుండి అద్దెపై భూమి తీసుకున్నాడు. వారు వ్యవసాయంలో రసాయనాలు ఉపయోగించరు. ఆయనకు చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఇష్టం.

ఆవులంటే ఆయనకు ఎంతో ప్రేమ. ఒకప్పుడు అతని పొలంలో ఉల్లి పంట ద్వారా 35 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. ఆ తర్వాత ఆవులంటే ప్రేమ పెరిగింది. ఆవులను తీసుకొచ్చి వాటిని సంరక్షించడం మొదలుపెట్టాడు. అతను శ్రీ గిర్ గౌ కృషి జాతన్ సంస్థ అనే పేరుతో తన సొంత గోశాలను నడుపుతున్నాడు.

రమేష్ రూపరేలియా గిర్ ఆవులను కొనుగోలు చేయడం ద్వారా పాల వ్యాపారం ప్రారంభించాడు. గీర్ ఆవు పాలతో తయారు చేసిన ఆర్గానిక్ నెయ్యిని అమ్మడం ప్రారంభించారు. సైకిల్‌పై గ్రామ గ్రామాన వెళ్లి నెయ్యి అమ్మేవాడు. దీనికి వినియోగదారుల నుంచి మంచి డిమాండ్ ఏర్పడింది. ఇది నెయ్యి ఉత్పత్తిపై దృష్టి పెట్టడానికి అతన్ని ప్రోత్సహించింది.

ఆవులకు సరైన దాణా ఇవ్వడం ప్రారంభించి నాణ్యమైన నెయ్యి తయారీ గురించి మరింత తెలుసుకున్నాడు. ఆయన చేసిన నెయ్యి బాగా ప్రాచుర్యం పొందింది. అతని వ్యాపారం పెరిగింది. ఇప్పుడు 123 దేశాలకు నెయ్యిని ఎగుమతి చేస్తున్నాడు. ప్రస్తుతం అతని వద్ద 250 గిర్ ఆవులు ఉన్నాయి.

ఏడాదికి సుమారు రూ.8 కోట్ల టర్నోవర్‌ను కలిగి ఉన్నాడు. తన కఠోర శ్రమతో చిత్తశుద్ధితో అందరి ముందు ఆదర్శంగా నిలిచారు. నిజాయితీగా చేస్తే ఏ వ్యాపారంలోనైనా విజయం సాధించడం కష్టమేమీ కాదని రమేష్ రూపరేలియా చెబుతున్నాడు. ఎంతో కష్టపడ్డ అతను.. అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు.