ఎస్1ఎక్స్ ప్లస్ ఇప్పుడు 11 కేడబ్ల్యూ గరిష్ట శక్తిని, 125 కిలోమీటర్ల గరిష్ట వేగంతో లాంచ్ చేశారు. ఈ స్కూటర్ 242 km వరకు ఐడీసీ పరిధిని కూడా కలిగి ఉంది. సింగిల్-ఛానల్ ఏబీఎస్‌తో ఫ్రంట్ డిస్క్ బ్రేక్, ఫిజికల్ కీ ఉంటుంది.
ఓలా ఎస్1 ఎక్స్ మూడు బ్యాటరీ ప్యాక్‌లతో అందుబాటులో ఉంటుంది. 2 కేడబ్ల్యూహెచ్, 3 కేడబ్ల్యూహెచ్, 4 కేడబ్ల్యూహెచ్ వేరియంట్స్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ స్కూటర్ గరిష్ట శక్తి 7 కేడబ్ల్యూకు పెరిగింది. ఈ స్కూటర్ దీని గరిష్ట వేగం గంటకు 123 కి.మీ.
ఓలా ఎస్1ప్రో ప్లస్ కొత్త ఫ్లాగ్లిప్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది డ్యూయల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, రిమ్ డెకాల్స్, డ్రై-కాస్ట్ గ్రాబ్ హ్యాండిల్, టూ టోన్ సీటు, 13 కేడబ్ల్యూ మోటారుతో వస్తుంది. ఈ స్కూటర్ గరిష్ట వేగం 141 కిలో మీటర్లుగా ఉంటే అలాగే ఈ స్కూటర్‌ను ఓ సారి చార్జ్ చేస్తే 320 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.
ఓలా ఎస్1ప్రో 3 కేడబ్ల్యూహెచ్, 4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఈ స్కూటర్‌ను ఓ సారి చార్జ్ చేస్తే 242 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 125 కి.మీగా ఉంది.
అలాగే ఓలా మూవ్ ఓస్ 5 బీటా కోసం ఆసక్తి ఉన్న కస్టమర్ల కోసం రిజిస్ట్రేషన్లను ప్రారంభించినట్లు ఓలా ఎలక్ట్రిక్ అధికారికంగా ప్రకటించింది. కంపెనీ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో పోస్ట్ ద్వారా ఈ ప్రకటన చేశారు. జెన్-1, జెన్-2 ఎలక్ట్రిక్ స్కూటర్లు రెండింటికీ బీటా సాఫ్ట్వేర్ అందుబాటులో ఉంది. అయితే కొత్తగా ప్రారంభించిన జెన్-3 3 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పటికే మూవ్ ఓఎస్-5తో వస్తుంది.