
బజాజ్ కంపెనీ నుంచి విడుదలైన చేతక్ 2903 ఎలక్ట్రిక్ స్కూటర్ మంచి రేంజ్ ఇస్తుంది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 123 కిలోమీటర్లు పరుగులు పెడుతుంది. దీనిలోని 2.9 కేడబ్యూహెచ్ బ్యాటరీని నాలుగు గంటల్లో 80 శాతం వరకూ చార్జింగ్ చేసుకోవచ్చు. బ్లూటూత్ కాల్ యాక్సెప్ట్/రిజెక్ట్, రివర్స్ లైట్, ఆటో ఫ్లాషింగ్, స్టాప్ ల్యాంప్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. ఈ స్కూటర్ అమెజాన్ లో రూ.95,998కు అందుబాటులో ఉంది.

సౌకర్యవంతమైన ప్రయాణానికి ఈవోక్స్ ఈ2 ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంతో బాగుంటుంది. దీనిలో దీర్ఘకాలం పనిచేసే బ్యాటరీ ఏర్పాటు చేశారు. భద్రత కోసం డిస్క్ బ్రేక్, యాంటీ థెప్ట్ లాకింగ్ సిస్టమ్ ఉన్నాయి. నలుపు, ఎరుపు, నీలం రంగుల్లో లభించే ఈ స్కూటర్ ను నడపడం చాలా సులభం. అమెజాన్ లో రూ.51,499కు కొనుగోలు చేయవచ్చు.

Eox Olo

గ్రీన్ ఇన్విక్టా ఎలక్ట్రిక్ స్కూటర్ ను పెద్దల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. దీనిలోని ఫిక్స్ డ్ రీచార్జిబుల్ బ్యాటరీని నాలుగు నుంచి ఆరు గంటల్లో చార్జింగ్ చేయవచ్చు. సింగిల్ చార్జింగ్ తో సుమారు 60 కిలోమీటర్లు పరుగులు తీస్తుంది. ప్రొజెక్టర్ లెన్స్, హెడ్‌లైట్, సిగ్నల్ లైట్లు, సౌకర్యవంతమైన కుషనింగ్ సీటు ఏర్పాటు చేశారు. అమెజాన్ లో రూ.39,999కి ఈ స్కూటర్ లభిస్తుంది.

పెద్దల కోసం అందుబాటులో ఉన్న మరో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది. దీనిలోని రీచార్జిబుల్ బ్యాటరీని ఒక్కసారి చార్జింగ్ చేస్తే సుమారు 40 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. గంటకు గరిష్టంగా 25 కిలోమీటర్ల వేగంతో పరుగెడుతుంది. ట్యూబ్ లెస్ టైర్లు, సిగ్నల్ లైట్లతో పాటు తెలుపు, ఆకుపచ్చ, నీలం రంగుల్లో అందుబాటులో ఉంది. గ్రీన్ సన్నీ స్కూటర్ ను కేవలం రూ.24,999కి కొనుగోలు చేయవచ్చు.