Best EV Scooter: స్కూటర్ మార్కెట్‌కు ఎలక్ట్రిక్ కిక్.. స్టోరేజీ కూడా ముఖ్యమే..!

Updated on: Feb 15, 2025 | 2:45 PM

ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ భారతదేశంలో బాగా పెరుగుతుంది. ముఖ్యంగా స్కూటర్ మార్కెట్‌లో ఈవీ హవా నడుస్తుంది. కొనునగోలుదారులు సాధారణ స్కూటర్లతో పాటు ఈవీ స్కూటర్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. నిర్వహణపరంగా మెరుగైన ఫలితాలు ఉండడంతో పట్టణ ప్రాంత ప్రజలు ఈవీ స్కూటర్లను కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్‌లో అందుబాటులో ఉన్న టాప్-5 ఈవీ స్కూటర్లలో స్టోరేజ్ విషయంలో కూడా టాప్‌లో ఉన్న స్కూటర్ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

1 / 5
బజాజ్ చేతక్ ఈవీ స్కూటర్ 26 లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్‌ను అందిస్తుంది. ముఖ్యంగా ఓపెన్-ఫేస్ హెల్మెట్ లేదా రోజువారీ నిత్యావసరాలకు సరిపోతుంది. సరికొత్త చేతక్‌లో 4 కేడబ్ల్యూ మోటార్‌తో వస్తుంది. అలాగే ఈ స్కూటర్ 126 కిలోమీటర్ల మైలేజ్‌తో గరిష్టంగా 73 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. దృఢమైన ఆల్-మెటల్ ఫ్రేమ్, కీలెస్ ఇగ్నిషన్ సిస్టమ్, బ్లూటూత్ కనెక్టివిటీ, వేగవంతమైన ఛార్జింగ్ సామర్థ్యాలను ఈ స్కూటర్ ప్రత్యేకతలు.

2 / 5
స్కూటర్ల ఎస్‌యూవీ పేర్కొనే రివర్ ఇండీ 43 లీటర్ల బూట్ స్పేస్‌తో వస్తుంది. 12 లీటర్ల ఫ్రంట్ గ్లోవ్‌బాక్స్‌తో ఆకట్టుకుంటుంది. 6.7 కేడబ్ల్యూ మోటారుతో శక్తిని పొందే ఈ స్కూటర్ 90 కి.మీ గరిష్ట వేగంతో వెళ్లతుంది. అలాగే ఓ సారి చార్జ్ చేస్తే 120 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ఇండీలో ట్విన్ ఫ్రంట్ ఫుట్‌పెగ్‌లు, ఎల్ఈడీ డ్యాష్‌బోర్డ్, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్‌లు వంటి ఫీచర్లు ప్రత్యేకంగా నిలుస్తాయి.

3 / 5
టీవీఎస్ ఐక్యూబ్ ఎస్‌టీ వేరియంట్ 32 లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్‌‌తో వస్తుంది. పట్టణ ప్రయాణీకులకు అనుకూలంగా ఉండే ఈ స్కూటర్ 4.4 కేడబ్ల్యూ మోటారుతో వస్తుంది. 82 గరిష్ట వేగంతో దూసుకుపోయే ఈ స్కూటర్ 145 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది. టీఎఫ్‌టీ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లు, రివర్స్ అసిస్టెన్స్, జియో-ఫెన్సింగ్ సామర్థ్యాలు ఆకట్టుకుంటాయి.

4 / 5
ఏథర్ ఎనర్జీకు సంబంధించిన ఫ్యామిలీ స్కూటర్ రిజ్టా 34 లీటర్ల బూట్ స్పేస్‌తో ఆకట్టుకుంటుంది. ఫఉల్ ఫేస్ హెల్మెట్‌ కూడా సరిపోయేంత స్టోరేజ్ ఈ స్కూటర్ ప్రత్యేకత. ఈ స్కూటర్ 4.3 కేడబ్ల్యూ మోటారుతో వస్తుంది. అలాగే 80 కిలోమీటర్ల గరిష్ట వేగంతో దూసుకుపోయే ఈ స్కూటర్ 125 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది. రైడ్ అసిస్ట్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇంటర్‌ఫేస్, ఆటోహోల్డ్ మరియు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ ఈ స్కూటర్ ప్రత్యేకతలు.

5 / 5
ఓలా ఎస్1 ప్రో జెన్-3 స్కూటర్ ప్రత్యేకమైన డిజైన్‌తో ఆకర్షిస్తుంది. ఈ స్కూటర్‌లో 34 లీటర్ బూట్ స్పేస్ ఉంటుంది. ఈ స్కూటర్ 11 కేడబ్ల్యూ పీక్ మోటారుతో 120 కి.మీ గరిష్ట వేగతంతో దూసుకుపోతుంది. అలాగే ఓ సారి చార్జ్ చేస్తే 195 మైలేజ్ ఇస్తుంది. ఎస్1 ప్రోలో మూవ్‌ఓఎస్ సామర్థ్యాలు, ప్రాక్సిమిటీ అన్‌లాకింగ్, వాయిస్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, మల్టీ రైడింగ్ మోడ్స్ ఆకట్టుకుంటాయి.