
ఈ పండుగ సీజన్‌లో సిట్రియెన్ సీ3 ఐదేళ్ల పొడిగించిన వారెంటీతో పాటు ఇతర ప్రయోజనాలతో కలిపి రూ. 99,000 తగ్గింపును అందిస్తుంది. అలాగే ఈ కారు కొనుగోలుపై ఆకర్షణీయమైన ఈఎంఐ సదుపాయాలు కూడా ఉన్నాయి. సీ 3 కారు గతేడాది లాంచ్ అయ్యింది. ఈ కారు ధర రూ. 6.16 లక్షల నుంచి రూ. 8.92 లక్షల వరకూ ఉంటుంది. ఈ కారు రెండు ఇంజిన్ ట్రిమ్‌లతో లభిస్తుంది.

గ్రాండ్ ఐ10 నియోస్ అనేది హ్యుందాయ్ కంపెనీకు చెందిన ఎంట్రీ-లెవల్ కారు. ఈ పండుగ సీజన్‌లో ఈ కారు దాదాపు రూ. 50,000 తగ్గింపుతో వస్తుంది. ఈ డీల్‌లో రూ.30,000 క్యాష్ ఆఫర్, రూ.10,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉన్నాయి. సెలెక్టివ్ వేరియంట్‌లపై కార్పొరేట్ డీల్స్ కూడా ఉన్నాయి. గ్రాండ్ ఐ10 నియోస్ ప్రారంభ ధర రూ. 5.84 లక్షల నుంచి రూ. 8.51 లక్షల వరకు ఉంటుంది.

రెనాల్ట్ క్విడ్ 2015లో రిలీజైంది. ఈ కారు మార్కెట్లో మంచి ఆదరణ పొందింది. ఈ కారు రూ.50,000 వరకు తగ్గింపును అందిస్తుంది. ఇందులో రూ.20,000 క్యాష్ ఆఫర్, మరో 20,000 ఎక్స్ఛేంజ్ పాలసీ, రూ.10,000 వరకు కార్పొరేట్ బోనస్ ఉన్నాయి. ఈ కారు ధర రూ. 4.70 లక్షల నుంచి రూ. 6.45 లక్షల వరకు ఉంటుంది.

మారుతి సుజుకి సెలెరియోపై కూడా అదిరిపోయే తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. సెలెరియోను 2021లో విడుదలైంది. పెట్రోల్, సీఎన్‌జీ వేరియంట్స్‌పై రూ. 59,000 వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. రూ. 35,000 క్యాష్ డిస్కౌంట్‌తో పాటు రూ. 20,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్, రూ. 4,000 కార్పొరేట్ ఆఫర్‌లు ఉన్నాయి. కస్టమర్లు అక్టోబర్ 2023లో సెలెరియోను బుక్ చేసుకుంటే ఈ బండిల్ డీల్‌ను ఎంచుకోవచ్చు. ఈ కారు ప్రారంభ ధర రూ. 5.37 లక్షల నుంచి రూ. 7.15 లక్షల వరకు ఉంటుంది.

అత్యంత ప్రజాధరణ పొందిన కంపెనీల్లో మొదటిదైన మారుతి సుజుకీ రిలీజ్ చేసిన ఇగ్నిస్ కారు అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ సీజన్‌లో ఈ కారు రూ. 70,000 తగ్గింపుతో వస్తుంది. ఇందులో రూ. 35,000 నగదు ఒప్పందంతో పాటు రూ. 25,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్, రూ. 10,000 కార్పొరేట్ బోనస్ ఉన్నాయి. ఇగ్నిస్ మారుతి ప్రీమియం బ్రాండ్ నెక్సా కింద అందుబాటులో ఉంది. ఈ కారు ప్రారంభ ధర రూ. 5.84 లక్షల నుంచి రూ. 8.30 లక్షల మధ్య లభించింది. ఈ కారు 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 5-స్పీడ్ ఏఎంటీతో వస్తుంది.