ICRA: దేశంలో వాహనాల ధరలు పెరిగిపోతున్నాయి. ద్విచక్ర వాహన విక్రయాలు ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో వార్షిక ప్రాతిపదికన 1-4 శాతం తగ్గే అవకాశం ఉందని క్రెడిట్ రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేస్తోంది.
వాహనాల ధరలు పెరగడం, పెట్రోల్ ధరలు రికార్డు స్థాయికి చేరడమే కారణమని వెల్లడించింది. ఏప్రిల్ - అక్టోబర్ మధ్య దేశీయంగా 80.5 లక్షల ద్విచక్ర వాహనాలు అమ్ముడుపోయినట్లు తెలిపింది.
2020లో ఇదే సమయంలో పరిశీలిస్తే పెద్దగా మార్పు లేదని తెలిపింది. ద్విచక్ర వాహనాల కొనుగోలుకు బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థలు రుణాలు ఇచ్చే విషయంలో వెనుకంజ వేసినట్లు తెలిపింది.
ఇలా రుణాల విషయంలో ఫైనాన్స్ సంస్థలు అచితూచి అడుగులు వేయడంతో పండగ సీజన్‌లో అనుకున్న స్థాయిలో విక్రయాలు జరగేలేదని వెల్లడించింది.