
హ్యుందాయ్ క్రెటా మిడ్-స్పెక్ ఎస్ ప్లస్ నైట్ ఎడిషన్ ట్రిమ్ నుంచి పొందుతుంది. ఇది 115 హెచ్‌పీ, 144 ఎన్‌ఎం, 1.5 లీటర్, పెట్రోల్ ఇంజన్ లేదా 116 హెచ్‌పీ, 250 ఎన్‌ఎం, 1. -లీటర్, డీజిల్ ఇంజన్‌తో వస్తుంది. రెండూ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఈ ఎస్‌యూవీ పనోరమిక్ సన్‌రూఫ్ చాలా మంది కస్టమర్‌లను క్రెటా వైపు ఆకర్షిస్తుంది. ఈ కార్ ధర రూ.13.96 లక్షల నుంచి రూ.19.20 వరకూ ఉంటుంది.

కియా సెల్టోస్ కారు హెచ్‌టీకే ప్లస్ ట్రిమ్ నుంచి పనోరమిక్ సన్‌రూఫ్‌తో వస్తుంది. ఈ కారు టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. హెచ్‌టీఎక్స్ నుంచి ఫేస్‌లిఫ్ట్ అన్ని వేరియంట్‌లలో ప్రామాణికంగా పనోరమిక్ సన్‌రూఫ్ వస్తుంది. 115 హెచ్‌పీ, 144 ఎన్‌ఎం, 1.5 లీటర్, పెట్రోల్ ఇంజన్, 116 హెచ్‌సీ, 250 ఎన్‌ఎం, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్, 160 హెచ్‌పీ, 253 ఎన్‌ఎం, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఈ ఇంజన్‌లన్నీ 6-స్పీడ్ మాన్యువల్ పని చేస్తుంది. ఈ కారు ధర రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకూ ఉంటుంది.

ఎంజీ ఆస్టర్ ఎంజీ మిడ్-స్పెక్ స్మార్ట్ ట్రిమ్ నుంచి ఆస్టర్‌లో పనోరమిక్ సన్‌రూఫ్‌ను అందిస్తుంది. ఆస్టర్ 110హెచ్‌పీ, 144 ఎన్‌ఎం 1.5 లీటర్, పెట్రోల్ ఇంజన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా సీవీటీతో వస్తుంది. ఈ కారు ఎరుపు రంగు ఇంటీరియర్‌తో పాటు పనోరమిక్ సన్‌రూఫ్ క్యాబిన్ ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ కారు ధర రూ.14.21 లక్షల నుంచి రూ.18.69 లక్షలుగా ఉంటుంది. ఆస్టర్ కారు బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు.

మారుతి సుజుకి గ్రాండ్ విటారాతో మధ్యతరహా ఎస్‌యూవీ సెగ్మెంట్‌లోకి ప్రవేశిస్తుంది. ఈ కారులో పనోరమిక్ సన్‌రూఫ్‌తో వస్తుంది. ఈ కారులో ఆల్ఫా పెట్రోల్ ట్రిమ్, బలమైన-హైబ్రిడ్ పవర్‌టరైన్ వంటి రెండు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంటుంది. భారీ సన్‌రూఫ్ క్యాబిన్‌ను మరింత కాంతితో ఉంటుంది. గ్రాండ్ విటారా 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఈ కారు ధర రూ.16.04 లక్షల నుంచి రూ.19.9 లక్షల వరకూ ఉంటుంది.