తల్లిదండ్రుల ఆస్తిపై పిల్లలకు హక్కులు ఉండవా..? చట్టాలు ఏం చెబుతున్నాయి..?

Updated on: May 03, 2026 | 10:42 AM

తల్లిదండ్రుల ఆస్తి పిల్లలకు వస్తుందా..? పిల్లలకు సర్వ హక్కులు ఉంటాయా? ఇందుకు భారత చట్టాల్లో అనేక నిబంధనలు ఉన్నాయి. వీటి గురించి ప్రతీఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరముంది. తల్లిదండ్రుల ఆస్తులు తమకే దక్కుతాయని చాలామంది భావిస్తుంటారు. ఆస్తుల విషయంలో గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి.

1 / 5
తల్లిదండ్రుల ఆస్తి పిల్లలకు వారసత్వంగా వస్తుందా..? పేరెంట్స్ ఆస్తిపై పిల్లలకు హక్కులు ఉంటాయా..? చాలామంది తల్లిదండ్రుల ఆస్తిపై తమకు హక్కు ఉంటుందని భావిస్తారు. ఇలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. భారత చట్టాల ప్రకారం.. తల్లిదండ్రుల ఆస్తి విషయంలో పిల్లలకు హక్కులు ఉంటాయా అంటే.. అది ప్రధానంగా ఆస్తి స్వభావంపై ఆధారపడి ఉంటుంది.

2 / 5
పిల్లల తల్లిదండ్రుల ఆస్తి క్లెయిమ్ చేసుకోవాలంటే.. అది వంశపార్వపరంగా వచ్చిందా? లేదా తమ సొంత ఖర్చుతో కొనుగోలు చేసిందా? అనే దానిపై ఆధారపడి ఉంటుంది. పిల్లలకు హక్కు ఉంటుందా.. లేదా అనేది ఈ విషయంపై ఆధారపడి ఉంటుంది. చట్టపరంగా ఆస్తిని రెండు వర్గాలుగా విభజించారు. సొంత కష్టంతో సంపాదించిదానికి స్వాధీనం చేసుకున్న ఆస్తిగా పిలిస్తే.. పూర్తీకుల నుంచి వచ్చిన ఆస్తిని వంశపారంపర్య ఆస్తిగా పిలుస్తారు.

3 / 5
తల్లిదండ్రులు తమ సొంత సంపాదనతో కొనుగోలు చేసిన ఆస్తిని తమకు నచ్చినవారికి ఇచ్చుకోవచ్చని చట్టం చెబుతుంది. దానిని అవసరమైతే అమ్ముకోవచ్చు లేదా దగ్గరి బంధువుకు బహుమతిగా ఇవ్వొచ్చు. లేదా వీలునామా ద్వారా వేరే వ్యక్తి కట్టబెట్టవచ్చు. పిల్లలకు ఆ ఆస్తిపై చట్టబద్దంగా ఎలాంటి హక్కులు ఉండవని చట్టాలు చెబుతున్నాయి.    ఒక కుటంబంలో వరుసగా నాలుగు తరాల పాటు ఆస్తి ఎటువంటి విభజన లేకుండా వస్తే అది పూర్వీకుల ఆస్తి కిందకు వస్తుంది.

4 / 5
పూర్వీకుల ఆస్తి విషయంలో పిల్లలకు సర్వ హక్కులు ఉంటాయి. తండ్రి ఒక్కడే ఈ ఆస్తికి సంబంధించి నిర్ణయాలు తీసుకోలేడు. దానిని అమ్మాలన్నా లేదా బదిలీ చేయాలన్నా అనమతి అవసరం. మైనర్ అయినా తల్లిదండ్రులు పిల్లల సమ్మతి అవసరం. నాలుగు తరాలుగా ఒకే కుటుంబంలో ఉంటే దానిని వంశపారంపర్యమైన ఆస్తిగా పరిగణిస్తారు. తండ్రి పూర్వీకుల నుంచి వారసత్వంగా పొంది ఉండాలి. అలాగే ఆస్తి చట్టబద్దంగా విభజించి ఉండకూడదు.

5 / 5
అయితే ఏదైనా ఆస్తిని వీలునామాగా పొందినా, బహుమతిగా పొందినా, సొంత డబ్బుతో కొనుగోలు చేసినా వంశపారంపర్య ఆస్తిగా పరిగణించరు. ఇలాంటి సమయంలో పిల్లలకు ఎలాంటి హక్కులు ఉండవని చట్టాలు చెబుతున్నాయి. తల్లిదండ్రుల ఆస్తి తమకే దక్కుతుందని చాలామంది భ్రమ పడుతుంటారు.

Follow Us