
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన కెనరా బ్యాంకు పిక్స్డ్ డిపాజిట్ తో పాటు, సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేట్లను సవరించింది. కొత్త రేట్లు ఆగస్టు 8 నుంచి అమల్లోకి వచ్చినట్లు బ్యాంకు అధికారిక ప్రకటనలో వెల్లడించింది. రూ.3 కోట్ల లోపు ఎఫ్డీలకు ఈ రేట్లు వర్తిస్తాయి. వడ్డీ రేట్లను సవరించిన తర్వాత కెనరా బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు సాధారణ పౌరులకు 3.25 శాతం నుంచి 6.5 శాతం మధ్య ఉన్నాయి. సీనియర్ సిటిజన్లకు అయితే 3.25 శాతం నుంచి 7 శాతం మధ్య ఉన్నాయి.

సవరించిన తర్వాత కెనరా బ్యాంకులో ఎఫ్డీ రేట్ల వివరాలు ఇలా ఉన్నాయి.. 7 రోజుల నుంచి 45 రోజులు : 3.25 శాతం, 46 రోజుల నుంచి 90 రోజులు : 4.25 శాతం, 91 రోజుల నుంచి 179 రోజులు : 4.5 శాతం, 180 రోజుల నుంచి 29 రోజులు : 5.5 శాతం, 270 రోజుల నుంచి ఏడాది లోపు టెన్యూర్ : 5.75 శాతంగా ఉంది.

ఏడాది నుంచి ఏడాది మూడేళ్ల లోపు టెన్యూర్ 6.25 శాతం, 444 రోజులు 6.5 శాతంగా ఉంది. ఏడాది మూడు నెలల నుంచి రెండేళ్ల లోపు టెన్యూర్ 6.25 శాతం, మూడేళ్ల పై నుంచి ఐదేళ్ల లోపు 6.25 శాతం, ఐదేళ్ల నుంచి 10 ఏళ్ల వరకు 6.25 శాతంగా నిర్ణయించింది.

మెచూరిటీకి ముందు ఎఫ్డీని విత్ డ్రా చేయాలనుకున్నా, పాక్షికంగా ఉపసంహరణలు జరిపినా 1 శాతం పెనాల్టీ కట్టాల్సి వస్తుందని బ్యాంకు తెలిపింది. సేవింగ్స్ అకౌంట్లకు అయితే కెనరా బ్యాంకు 2.55 శాతం నుంచి 4 శాతం వరకు వడ్డీ రేటును చెల్లిస్తోంది.

రూ.50 లక్షల వరకు 2.55 శాతం, రూ.50 లక్షల నుంచి రూ.5 కోట్ల వరకు 2.55 శాతం, రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల లోపు 2.55 శాతం, రూ.10 కోట్ల నుంచి రూ.100 కోట్ల లోపు 2.55 శాతం, రూ.100 కోట్ల నుంచి రూ.200 కోట్ల లోపు 2.65 శాతంగా నిర్ణయించింది. ఇక ఈ బ్యాంకు అత్యధికంగా రూ.2,000 కోట్లు, అంతకంటే ఎక్కువ బ్యాలెన్స్ కలిగిన సేవింగ్స్ ఖాతాలకు 4 శాతం వడ్డీని చెల్లిస్తుంది.