Personal Loan: పర్సనల్ లోన్ ప్రీ క్లోజ్ చేస్తే లాభమా? నష్టమా? తెలియాలంటే ఇది చదవండి..

|

Aug 03, 2024 | 8:18 PM

పర్సనల్ లోన్.. ఇటీవల కాలంలో విరివిగా వినిపిస్తున్న పేరు. వ్యక్తుల అత్యవసర పరిస్థితుల్లో ఇది చాలా ఉపయోగపడుతోంది. సులభంగా ఎటువంటి డాక్యూమెంట్స్ లేకుండా.. తనఖా కూడా అవసరం లేకుండా ఈ లోన్లు మంజూరవుతుంటాయి. కేవలం వ్యక్తుల క్రెడిట్ హిస్టరీ ఆధారంగా ఇచ్చే సిబిల్ స్కోర్ ని బట్టి బ్యాంకులు లోన్లు అందిస్తుంటాయి. లోన్ తీసుకున్నప్పుడు బాగానే ఉంటుంది. కానీ తిరిగి వాటి ఈఎంఐలు చెల్లించేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి. వడ్డీ భారం అధికమవుతుంది. అందుకే చాలా మంది పర్సనల్ లోన్ ప్రీ క్లోజర్(రుణాన్ని ముందస్తుగా ముగించడం) గురించి అడుగుతున్నారు. చాలా బ్యాంకులు పర్సనల్ లోన్ ను గడువుకు ముందే చెల్లించడానికి అనుమతిస్తాయి. అయితే దానికి కొన్ని నిబంధనలు, షరతలను విధిస్తాయి. పర్సనల్ లోన్ తీసుకునే ముందు వాటి గురించి తెలుసుకోవడం ముఖ్యం..

1 / 5
వ్యక్తిగత రుణం ప్రీ క్లోజర్ ను బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అనుమతిస్తాయి. అయితే వాటిపై కొంత పెనాల్టీలు వసూలు చేస్తాయి. అది ఎంత అనేది బ్యాంకులను బట్టి మారుతుంటుంది. కొన్ని బ్యాంకులు నిర్ణీత కాలం తర్వాత క్లోజర్ కు అనుమతిస్తాయి. అందుకే లోన్ తీసుకునే ముందే ప్రీ క్లోజర్ గురించి తెలుసుకోవాలి.

2 / 5
ప్రీ క్లోజర్ తో పాటు పార్షియల్ పేమెంట్(పాక్షిక పేమెంట్) ఆప్షన్ కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. అయితే అది అన్ని బ్యాంకుల్లో ఉండదు. ఇది ఉంటే వినియోగదారులకు చాలా ప్రయోజనకరగంగా ఉంటుంది. అయితే దీనిపై కూడా పెనాల్టీలు ఉండే అవకాశం ఉంది. బ్యాంకుల్లో ముందుగానే దీని గురించి అడగాలి.

3 / 5
పర్సనల్ లోన్ ను ముందస్తుగా ముగించాలనుకున్నప్పుడు దానిపై పెనాల్టీ గురించి ఆలోచించాలి. సాధారణంగా దీనికి 5శాతం వరకూ పెనాల్టీ పడుతుంది. అయితే ఇది బ్యాంకును బట్టి.. మీరు తిరిగి చెల్లిస్తున్న కాలాన్ని బట్టి మారుతుంటుంది. అంతే ఎంత ముందుగా చెల్లింపు చేస్తున్నారన్న దానిపై ఆధారపడి ఉంటుంది.

4 / 5
పెనాల్టీ ఎలా ఉంటుంది అనేది ఇంకా క్లియర్ గా అర్థం కావాలంటే.. ఈ ఉదాహరణ చూడండి.. మీరు లోన్ తీసుకున్నాక 13 నుంచి 24 నెలల మధ్య ప్రీ క్లోజర్ చేయాలనుకుంటే 4శాతం, 25 నుంచి 36 నెలల మధ్య ప్రీ క్లోజ్ చేయాలనుకుంటే 3శాతం, 36 నెలల తర్వాత అయితే 2శాతం పెనాల్టీని అప్పటికి ఉన్న అసలుపై బ్యాంకులు వసూలు చేసే అవకాశం ఉంటుంది.

5 / 5
మీరు పర్సనల్ లోన్ ప్రీ క్లోజ్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. దాని కాల పరిమితి. లోన్ తీసుకున్న మొదటి దశలోనే దానిని ప్రీ క్లోజ్ చేసుకోవడం ఉత్తమం. లోన్ చివరి దశకు వచ్చినప్పుడు ప్రీ క్లోజ్ చేస్తే పెద్దగా ప్రయోజనం ఉండదు. ముందుగా చేస్తే వడ్డీ తగ్గే అవకాశం ఉంటుంది. కానీ చివరిలో చేస్తే వడ్డీ పెద్దగా తగ్గదు.