Subhash Goud |
Mar 11, 2022 | 8:41 PM
BMW SUV: మార్కెట్లో రకరకాల కార్లు విడుదలవుతన్నాయి. అత్యాధునిక టెక్నాలజీని జోడిస్తూ కార్లను విడుదల చేస్తున్నాయి కంపెనీలు. ఇక తాజాగా బీఎండబ్ల్యూ అప్‌డేటెడ్ వెర్షన్ ఎస్‌యూవీ కౌప్ ఎక్స్4ను మార్కెట్లో విడుదల చేసింది.
ఈ కారును రెండు మోడళ్లలో విడుదలైంది. ఇక పెట్రోల్ వెర్షన్ కారు ధర రూ.70.50 లక్షలు, డీజిల్ వెర్షన్ ధర రూ.72.50 లక్షలుగా నిర్ణయించింది కంపెనీ.
అప్‌డేటెడ్ వెర్షన్‌ను విడుదల చేసిన మోడల్ డిజైన్, కొత్త ఫీచర్స్‌తో పలు మార్పులు చేసింది. చెన్నై ప్లాంట్‌లోనే తయారైన ఈ కారు దేశ వ్యాప్తంగా ఉన్న డీలర్ల వద్ద అందుబాటులో ఉండనున్నట్లు తెలిపింది.
మూడు లీటర్ల డీజిల్ ఇంజిన్ కలిగిన ఎక్స్4 మోడల్ కేవలం 5.8 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే సామర్థ్యం ఉంది.