
Toyota Cars: టయోటా కార్ల సంస్థ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ఇస్తోంది. వివిధ రకాల మోడళ్లపై భారీ డిస్కౌంట్ అందిస్తున్నట్లు ప్రకటించింది. పలు రకాల మోడళ్లపై డిస్కౌంట్‌తోపాటు నగదు డిస్కౌంట్, ఎక్ఛేంజ్ ఆఫర్ ఆఫర్ ప్రకటించింది.

టయోటా గ్లాంజా, యూరిస్, అర్బన్ క్రూయిజర్, టయోటా ఇన్నోవా క్రిస్టా తదితర మోడళ్లపై ఆఫర్ల వర్తించనున్నాయి. ఈ ఆఫర్ జూన్ 30వ తేదీ వరకు ఉంటుంది.

గ్లాంజా వాహనంపై రూ.20 వేల బెటిఫిట్స్ ఉన్నాయి. 8వేల రూపాయల నగదు తగ్గింపు అందిస్తోంది. అర్బన్ క్రూయిజర్ పై రూ.20 వేల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఇక యూరిస్‌పై కూడా 50 వేల రూపాయల వరకు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు ఎక్ఛేంజ్ ఆఫర్ కింద రూ.25 వేల వరకు తగ్గింపు వర్తించనుంది