
మీకు రుణం మంజూరు చేయాలంటే బ్యాంకులు ముఖ్యంగా మీ సిబిల్ స్కోర్‌ను తనిఖీ చేస్తాయి. ఈ నేపథ్యంలో హోమ్ లోన్ తీసుకునే ముందుకు సిబిల్ వెబ్‌సైట్ లేదా ఏదైనా ఇతర అధికారికంగా ఆమోదించిన రేటింగ్ ఏజెన్సీ నుంచి మీ క్రెడిట్ హిస్టరీను డౌన్‌లోడ్ చేసుకోవాలి. మీ స్కోర్ మంచిగా ఉంటే తక్కువ వడ్డీకు రుణం పొందవచ్చు.

హోమ్ లోన్ తీసుకునే ముందు క్రెడిట్ కార్డు బిల్లులు, ఈఎంఐలు లేదా ఇతర రుణాలు ఏవైనా బకాయిలు ఉంటే వాటిని వాటి గడువు తేదీలలోపు చెల్లించాలి. ఈ చెల్లింపులు మిస్ అయితే మీ క్రెడిట్ స్కోర్ తీవ్రంగా ప్రభావితం అవుతుంది.

మీకు క్రెడిట్ కార్డులు ఉంటే మీ వినియోగ నిష్పత్తిని మీ క్రెడిట్ పరిమితిలో 50 శాతం కంటే తక్కువగా ఉంచడానికి ప్రయత్నించాలి. క్రెడిట్ కార్డు అధికంగా వినియోగిస్తే మీరు క్రెడిట్ స్కోర్ తీవ్రంగా ప్రభావితం అవుతుంది.

మీ లోన్ రీ పేమెంట్ సామర్థ్యాన్ని నిర్ణయించడానికి బ్యాంకర్లు మీ స్థిర ఆదాయ నిష్పత్తి (ఎఫ్ఓఐఆర్)ని పరిశీలిస్తారు. మీకు కొనసాగుతున్న వ్యక్తిగత రుణాలు లేదా ఇతర ఈఎంఐలు ఉంటే దరఖాస్తు చేసుకునే ముందు వాటిని ముందస్తుగా చెల్లించి మూసివేయడానికి ప్రయత్నించాలి. ఇలా చేస్తే మీ లోన్ రీపేమెంట్ సామర్థ్యం మెరుగ్గా ఉంటుంది.

మీరు లోన్ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నప్పుడు బ్యాంకుల మధ్య వడ్డీ రేట్లను తరచూగా సందర్శిస్తూ ఉంటారు. అయితే మీరు వెళ్లిన ప్రతిసారీ వారు మీ క్రెడిట్ హిస్టరీ తీస్తారు. కాబట్టి మీరు బ్యాంకుల మధ్య వడ్డీ రేట్లను ఓ పది రోజుల్లో తెలుసుకుంటే మీ క్రెడిట్ హిస్టరీపై పెద్దగా ప్రభావం ఉండదు.